తదుపరి వార్తా కథనం

Chandrababu: పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 28, 2025
03:26 pm
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సీఎం చంద్రబాబు సందర్శించారు. ఆయన ఆరోగ్య స్థితిని నేరుగా తెలుసుకోవడానికి హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లి జాగ్రత్తగా పర్యవేక్షించారు. ఐదు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరుతో బాధపడుతున్నట్టు ఆయన కార్యాలయం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించినప్పటికీ, మంగళవారం పవన్ కల్యాణ్, శాఖాపరమైన అంశాలపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా చర్చలు నిర్వహించారు.