LOADING...
Chandrababu: తీరం దిశగా దూసుకొస్తున్న మొంథా.. గాలుల తీవ్రతపై సీఎం ఆందోళన
Chandrababu: తీరం దిశగా దూసుకొస్తున్న మొంథా.. గాలుల తీవ్రతపై సీఎం ఆందోళన

Chandrababu: తీరం దిశగా దూసుకొస్తున్న మొంథా.. గాలుల తీవ్రతపై సీఎం ఆందోళన

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2025
07:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

మొంథా తుపాన్ తీవ్రరూపం దాల్చి తీరం వైపు చేరుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కోస్తా ఆంధ్ర జిల్లాలపై తుపాను ప్రభావం ఇప్పటికే కనిపిస్తోందని అధికారులు ఆయనకు నివేదించారు. కాకినాడ, మచిలీపట్నం, విశాఖపట్నం వంటి తీరప్రాంతాల్లో వర్షాలు, బలమైన గాలులు కొనసాగుతున్నాయని వివరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అన్ని విభాగాలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. గతంలో సంభవించిన తుపానుల నష్టం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. తుపాను తీరం దాటే అవకాశం ఉన్న కాకినాడ, పరిసర ప్రాంతాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ సహాయక బృందాలను వెంటనే తరలించాలని ఆయన సూచనలు జారీ చేశారు.

వివరాలు 

ప్రజల భద్రతకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశం

గాలుల వేగం, వర్షపాతం తీవ్రతలను ముందుగానే అంచనా వేసి, ప్రజల భద్రతకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. తుపాను ప్రభావం ఉన్న జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే అత్యవసర విధుల్లో నిమగ్నమయ్యారని సీఎస్‌ విజయానంద్‌ సీఎంకు వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రులు నారా లోకేశ్‌, అనిత, నారాయణతో పాటు పలు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తుఫాన్ నేపథ్యంలో ఏపీ సర్కార్ హై అలెర్ట్