Chandrababu: జనవరి నుంచి అమల్లోకి పీ4 విధానం.. 15శాతం గ్రోత్ రేట్ లక్ష్యం
నూతన విధానాలతో అన్ని రంగాలను పునరుద్ధరించి మళ్లీ ఆర్థిక వృద్ధిని సాధించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రయత్నించాలని అభిప్రాయపడ్డారు. 15 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం పనిచేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు,పారిశ్రామిక రంగం, సేవల రంగంలో వృద్ధిని సమీక్షించేందుకు సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సంబంధిత శాఖల అధికారులు గత పదేళ్లలోని పరిస్థితులను వివరించారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు అన్ని రంగాలను నాశనం చేసి, ఆర్థిక వ్యవస్థను కుదేలించినందున ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కొత్త విధానాలను ప్రతి శాఖలో తీసుకురావడం ద్వారా, ఈ విధానాలను సమర్థవంతంగా అమలు చేసి ఆర్థిక పురోగతిని సాధించాలని ఆయన తెలిపారు.
అప్పటి నిర్ణయాలతో రాష్ట్రం 13.7 శాతం వృద్ధి రేటును సాధించింది
ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు, ప్రజలపై అదనపు భారాలు ఉండకుండా ప్రభుత్వ ఆదాయాలను పెంచే విధానాలను అమలు చేయాలని ఆయన ఆదేశించారు. వ్యవసాయ రంగంలో సమగ్ర యంత్రీకరణ ద్వారా సాగు ఖర్చులను తగ్గించవచ్చని చెప్పారు. ప్రభుత్వ పాత్ర పథకాలను ఇవ్వడంలో మాత్రమే కాకుండా, ఆయా రంగాలను బలోపేతం చేసి ప్రజల ఆదాయాలను పెంచడంలో ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. 2014 తరువాత విభజన కష్టాలు ఉన్నా,అప్పటి నిర్ణయాలతో రాష్ట్రం 13.7 శాతం వృద్ధి రేటును సాధించిందని ఆయన గుర్తు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో వృద్ధి రేటు 10.59 శాతానికి తగ్గిందని చెప్పారు.
ఏపీ తలసరి ఆదాయంలో 5వ స్థానం
2019లో తెలంగాణతో పోలిస్తే ఏపీ జీఎస్‌డీపీలో వ్యత్యాసం కేవలం 0.20 శాతం మాత్రమే ఉండగా, 2024లో ఈ వ్యత్యాసం 1.5 శాతానికి పెరిగింది. 2014-15 మధ్య ఏపీ ప్రజల తలసరి ఆదాయం రూ.93,903 కాగా, తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో 2019 నాటికి అది రూ.1,54,031కి పెరిగిందని ఆయన వివరించారు. దక్షిణాది రాష్ట్రాల్లో,ఏపీ తలసరి ఆదాయంలో 5వ స్థానంలో ఉందని ఆయన తెలిపారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ శాఖలు విజన్ సిద్ధం చేసి, నిర్ధిష్ట లక్ష్యాలతో పనిచేయాలని అధికారులకు సూచించారు.
CSR ద్వారా పేదల జీవన ప్రమాణాలను పెంచడంలో దోహదపడాలి: చంద్రబాబు
జనవరి నుంచి పీ4 విధానాన్ని అమలు చేయనున్నామన్నారు. ఈ విధానంతో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఆర్థికంగా అట్టడుగున ఉన్న 10 శాతం మందిని పైకి తీసుకువచ్చేందుకు సహాయపడాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు, సంపన్నులు,సంస్థలు CSR ద్వారా పేదల జీవన ప్రమాణాలను పెంచడంలో, వారికి అవకాశాలను కల్పించడంలో మెంటార్ లా దోహదపడాలని ముఖ్యమంత్రి సూచించారు.