
Chandrababu: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ
ఈ వార్తాకథనం ఏంటి
సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త బార్ పాలసీ అమలులోకి రానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం అందించిన నివేదిక ఆధారంగా ఈ కొత్త పాలసీ రూపొందించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మద్యం పాలసీ ద్వారా కేవలం ఆదాయం పొందడమే లక్ష్యంగా కాకుండా, ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండే మద్యం అమ్మకాల ద్వారా నష్టాన్ని కొంత మేర తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. మద్యం వలన పేదల ఇళ్లు తలకిందులయ్యే పరిస్థితులు ఉండకూడదని సూచించారు. అలాగే బార్ల నిర్వహణలో గీత కార్మిక వర్గాలకు 10 శాతం షాపులు కేటాయించాలని నిర్ణయించినట్లు కూడా సీఎం ప్రకటించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఏపీలో కొత్త బార్ పాలసీ: చంద్రబాబు
ఏపీలో కొత్త బార్ పాలసీ: చంద్రబాబు
— BIG TV Breaking News (@bigtvtelugu) August 4, 2025
సెప్టెంబర్ 1 నుంచి మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఆధారంగా రాష్ట్రంలో కొత్త బార్ పాలసీ
మద్యం పాలసీ అంటే ఆదాయం కాదు.. ప్రజల ఆరోగ్యం
బార్లలోనూ గీత కార్మిక వర్గాలకు 10 శాతం షాపులు
- సీఎం చంద్రబాబు pic.twitter.com/y6vKrQJ1J0