Page Loader
CM Chandrababu: 'బ్రాండ్ ఏపీ' పేరుతో దావోస్‌కు సీఎం చంద్రబాబు
'బ్రాండ్ ఏపీ' పేరుతో దావోస్‌కు సీఎం చంద్రబాబు

CM Chandrababu: 'బ్రాండ్ ఏపీ' పేరుతో దావోస్‌కు సీఎం చంద్రబాబు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 19, 2025
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆదివారం సాయంత్రం అమరావతి నుంచి దిల్లీకి చేరుకున్న చంద్రబాబు, అర్ధరాత్రి తన బృందంతో కలిసి స్విట్జర్లాండ్‌ లోని జ్యూరిచ్‌కు బయల్దేరతారు. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సుకు 'బ్రాండ్ ఏపీ' పేరుతో పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిజినెస్ దిగ్గజాలు ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం తన ప్రయత్నాలను కేంద్రించనున్నారు. సీఎం తొలి రోజున జ్యూరిచ్‌లో 10 పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అనంతరం హోటల్ హయత్‌లో 'మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పొరా' పేరుతో తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొని, ఏపీపై పెట్టుబడుల అవకాశాలు చర్చిస్తారు.

Details

అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సమావేశం

తర్వాత దావోస్‌లో పారిశ్రామికవేత్తలతో మరో సమావేశం జరుగుతుంది. ఇందులో ఆర్సెలార్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిత్తల్‌తో ప్రత్యేకంగా సమావేశమవుతారు. రెండో రోజు సీఐఐ సెషన్‌లో గ్రీన్ హైడ్రోజన్, సోలార్ ఇంపల్స్, వెల్‌స్పన్, కోకకోలా, ఎల్‌జీ, కార్ల్స్‌బర్గ్, వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్, సిస్కో, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థల ఛైర్మన్లు, సీఈఓలతో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి యూఏఈ ఎకానమీ మంత్రి అబ్దుల్లా బిన్ కూడా హాజరవుతారు. అనంతరం, ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ చర్చల్లో కూడా సీఎం పాల్గొంటారు. మూడో రోజు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో మరోసారి సమావేశాలు జరుపుతారు. దావోస్‌లో రోజుకు కనీసం పదికి పైగా సమావేశాలు నిర్వహించి, నాలుగో రోజు ఉదయం స్వదేశానికి తిరిగి వస్తారు.