తదుపరి వార్తా కథనం

CM Chandrababu:రేపు శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన..సాగర్‌కు నీటి విడుదల
వ్రాసిన వారు
Sirish Praharaju
Jul 07, 2025
05:16 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు శ్రీశైలానికి పర్యటన చేయనున్నారు. ఈ పర్యటన సందర్భంగా శ్రీశైలం జలాశయ గేట్లను ఎత్తి, నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు తుది నీటిమట్టానికి సమీపంలో ఉంది. వరద నీరు ప్రవాహం కొనసాగుతుండగా, జలాశయానికి ఇన్‌ఫ్లో 1,62,529 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 54,191 క్యూసెక్కులు నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతానికి శ్రీశైలం జలాశయం 880.70 అడుగుల నీటిమట్టంలో ఉంది. ఇందులో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.7080 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వ 191.6512 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండడం గమనార్హం.