CM Chandrababu: భారీ వర్షాల నేపథ్యంలో.. ఆయా శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల గురించి కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రస్తుత పరిస్థితుల గురించి సీఎం కు కలెక్టర్లు, అధికారులు వివరించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయని జిల్లా అధికారులు తెలిపారు.
అలాగే, సాగునీటి ప్రాజెక్టుల వద్ద నీటి ప్రవాహాలు, చెరువులు, వాగుల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.
సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రవాహాలు, నీటి నిర్వహణ చర్యలను ముఖ్యమంత్రి సమీక్షించారు.
నేడు కూడా భారీ వర్షాలు పడనున్నాయని హెచ్చరికలు ఉన్నందున, పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచనలు ఇచ్చారు.
వివరాలు
కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడరేవుల్లో ఒకటో నెంబరు హెచ్చరికలు
ఇదిలా ఉండగా, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు నెల్లూరు జిల్లాలోని తడ వద్ద 22 కిలో మీటర్ల వేగంతో తీరం దాటింది.
భారత వాతావరణ శాఖ దీనిని అల్పపీడనంగా మారి బలహీనపడుతుందని హెచ్చరించింది.
ఈ అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది.
కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడరేవుల్లో ఒకటో నెంబరు హెచ్చరికలు వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు.