Page Loader
ycp bus yatra: "మేమంతా సిద్దం" పేరుతో సీఎం జగన్ బస్సుయాత్ర
"మేమంతా సిద్దం" పేరుతో సీఎం జగన్ బస్సుయాత్ర

ycp bus yatra: "మేమంతా సిద్దం" పేరుతో సీఎం జగన్ బస్సుయాత్ర

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 18, 2024
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

రానున్న లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి బస్సుయాత్ర ప్రారంభించనున్నారు. ఈ బస్సు యాత్రకు 'మేమంతా సిద్దం'అని నామకరణం చేశారు. ప్రచారానికి సంబంధించిన పూర్తి వివరాలను రేపు పార్టీ విడుదల చేయనుంది. బస్సు యాత్ర అనంతరం వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార సభను నిర్వహించనుంది. పార్టీ కూడా అన్ని ప్రాంతాల్లో సభలు నిర్వహించాలని నిర్ణయించి,సమావేశాలకు పేర్లు కూడా సిద్ధం చేశారు. ఇప్పుడు జిల్లాల వారీగా(పార్లమెంటరీ నియోజకవర్గాలు)బస్సు యాత్ర షెడ్యూల్ చేస్తున్నారు. బస్సు యాత్ర ఈ నెల 26 లేదా 27 నుండి ప్రారంభమై 21రోజుల పాటు కొనసాగుతుంది"అని పార్టీ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే సిద్దం సన్నాహక సమావేశాలు నిర్వహించిన 4జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో ఈ యాత్ర జరగనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన సీఎం జగన్