
అతి తక్కువ కాలంలోనే తెలంగాణలో గణనీయ అభివృద్ధి: కేసీఆర్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లాలో కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.
మెదక్ కలెక్టర్ ఆఫీస్ రూపశిల్పి ఉషారెడ్డి మన తెలంగాణ బిడ్డేనని పేర్కొన్న కేసీఆర్ ఆమెకు అభినందనలు తెలిపారు. మరోవైపు తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా కొనసాగుతోందని చెప్పుకొచ్చారు.
స్వచ్ఛమైన తాగునీటిని ఇంటింటికి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ అతితక్కువ కాలంలోనే చాలా వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. సుమారు 60, 70 ఏళ్ల క్రితం నుంచే రాష్ట్రాల హోదాతో ఉన్న వాటి కంటే తెలంగాణలో గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు.
DETAILS
రూ.200 ఉన్న ఆసరా పెన్షన్లను రూ.4016కు పెంచాం : సీఎం
తొమ్మిదిన్నర సంవత్సర కాలంలోనే తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఎదిగిందన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలకు అసెంబ్లీ, సచివాలయ భవనాలు కూడా సరిగ్గా లేవన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 33 జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రస్తుతం 24వ కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు అన్ని జిల్లాల్లో నిర్మించుకున్న పరిపాలనా భవనాలను చూస్తేనే రాష్ట్ర అభివృద్ధి అర్థమైతుందన్నారు. ఉమ్మడి ఏపీలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆనాటి తెలంగాణ ప్రాంతం వెనుకబాటుకు గురైందన్నారు.
స్వరాష్ట్రంలో చాలా అభివృద్ధి జరుగుతోందని, అయినా తమపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.200 ఉన్న ఆసరా పెన్షన్లను, ప్రస్తుతం రూ.4016కు పెంచామని చెప్పుకొచ్చారు.