Telangana Police: సీఎం ఫొటోల వివాదం.. తెలంగాణాలో ప్రత్యేక సిట్ ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ సీసీఎస్(CCS)తో పాటు నారాయణపేట జిల్లా మద్దూర్‌లో నమోదైన సంచలనాత్మక కేసుల దర్యాప్తు కోసం తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT)ను ఏర్పాటు చేశారు. ఈ సిట్‌కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నాయకత్వం వహించనున్నారు. మొత్తం ఎనిమిది మంది అధికారులతో ఈ ప్రత్యేక బృందాన్ని డీజీపీ ఏర్పాటు చేశారు. సీఎం ఫొటోలు పోస్ట్ చేసిన కేసు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోలను అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటనలో తెలంగాణ పబ్లిక్ టీవీ వాట్సాప్ గ్రూప్‌కు చెందిన కావలి వెంకటేశ్‌పై కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 11న నారాయణపేట జిల్లా మద్దూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Details
మహిళా ఐఏఎస్ అధికారిపై అనుచిత వార్తలు
ఇటీవల ఓ మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచే విధంగా వార్తలు టెలికాస్ట్ చేసిన ఘటనపై హైదరాబాద్ సీసీఎస్‌లో మరో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో రెండు తెలుగు న్యూస్ ఛానల్స్‌తో పాటు ఏడు యూట్యూబ్ ఛానళ్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేశ్‌రంజన్ ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసులు ఈ రెండు కేసుల్లోనూ నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS)సెక్షన్లు 75, 78, 79, 351(1), 352(2) కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సిట్‌కు దర్యాప్తు బాధ్యత ఈరెండు కీలక కేసుల దర్యాప్తు పూర్తి బాధ్యతను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)కు అప్పగించారు.
Details
సిట్ సభ్యుల వివరాలు
నార్త్ రేంజ్ జాయింట్ సీపీ - శ్వేత చేవెళ్ల డీసీపీ - యోగేశ్ గౌతమ్ హైదరాబాద్ అడ్మిన్ డీసీపీ - వెంకటలక్ష్మి సైబర్ క్రైం డీసీపీ - అరవింద్ బాబు విజిలెన్స్ అదనపు ఎస్పీ - ప్రతాప్ కుమార్ సీసీఎస్ ఏసీపీ - గురు రాఘవేంద్ర సీఐ సెల్ ఇన్‌స్పెక్టర్ - శంకర్‌రెడ్డి సైబర్ సెల్ ఎస్సై - హరీశ్ ఈ కేసులపై సిట్ లోతైన దర్యాప్తు చేపట్టనుందని అధికారులు స్పష్టం చేశారు.