కేబినేట్ విస్తరణ నామినేటెడ్ పోస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు.. ఢిల్లీలో తొలిసారిగా పీఏసీ సమావేశం
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 10 రోజులు అయింది. ఇప్పటికే 11 మంది మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇంకా ఏడు ఖాళీలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తర్వాత తొలిసారిగా పొలిటికల్ ఆఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ విస్తరణలో తమకు అవకాశం వస్తుందని పలువురు నేతలు అతృతుగా ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ పదవుల భర్తీపై హైకండ్‌తో రేవంత్ రెడ్డి చర్చించనున్నారని సమాచారం. ప్రభుత్వం ఏర్పడిన తరవాత జరుగుతున్న సమావేశం అయినందున ముఖ్య నాయకులకు కీలక బాధ్యతలను అప్పగించేలా చర్చించే అవకాశం ఉందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు
రేసులో ఫిరోజ్ ఖాన్, షబ్బీర్ అలీ
త్వరలోనే లోక్ సభ, పంచాయతీ ఎన్నికలు రానున్నాయి. ముఖ్యంగా 7 మంత్రి పదవులపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఫిరోజ్ ఖాన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ ఇద్దరు నేతలు రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితులు, మైనార్టీలో ఒకరికి మంత్రి ఇస్తే ఎశరికి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి, నిజామాబాద్ జిల్లాలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, మైనంపల్లి హన్మతరావు మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
రేపు దిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
ఇక షబ్బీర్ అలీ, అంజన్ కుమార్, మధుయాష్కీలకు మంత్రులగా అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీలు ఎంపికచేస్తారని వారి అనుచరులు చెబుతున్నారు. మంత్రివర్గంలో ఆరుగురు ఓసీలు ఉంటే బీసీలు ఇద్దరు, ఎస్సీలు ఇద్దరు, గిరిజనులు ఒకరు ఉన్నారు. ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల అంశంపై హైకమాండ్‌తో చర్చిస్తారని తెలుస్తోంది