NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Cm Revanth : ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణం తొలి సంతకం దేనిపై అంటే
    తదుపరి వార్తా కథనం
    Cm Revanth : ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణం తొలి సంతకం దేనిపై అంటే
    Cm Revanth : ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణం తొలి సంతకం దేనిపై అంటే

    Cm Revanth : ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణం తొలి సంతకం దేనిపై అంటే

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 07, 2023
    09:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా నేడు మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు.అనంతరం తొలి సంతకం ఆరు గ్యారంటీలపైనే పెట్టనున్నారు.

    ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మేనిఫెస్టోతో పాటు ఆరు గ్యారెంటీలను హామీలుగా ఇచ్చింది. అయితే అన్నిటికంటే ఈ ఆరు గ్యారంటీలు ప్రచార పర్వంలో కీలక పాత్ర పోషించాయి.

    వాటిని జనాల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పట్ల ప్రజలకు సానుకూల దృక్పదాన్ని కలిగించారు పార్టీ నేతలు.

    ఆరు గ్యారంటీలు ఇవే :

    మహాలక్ష్మి :

    18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.2500 రూపాయల డబ్బులు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. గ్యాస్‌ సిలిండర్ ధరలను రూ.400కే ఇస్తామన్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది.

    details

    వరి పంటకు క్వింటాలుకు రూ.500 బోనస్

    రైతు భరోసా

    ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15000లను రైతు భరోసాగా ఇస్తామని చెప్పింది. వ్యవసాయ కూలీలకు రూ.12000 ఇస్తామని హామీనిచ్చింది. వరి పంటకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది.

    గృహ జ్యోతి :

    గృహజ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామని భరోసా ఇచ్చింది.

    ఇందిరమ్మ ఇళ్లు :

    ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి రూ. 5 లక్షలతో నిర్మాణం చేసుకునేలా ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చింది.

    తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని గ్యారంటీ ఇచ్చింది.

    details

    కాంగ్రెస్ శ్రేణుల ముందు ఆరు గ్యారెంటీలపై సంతకాలు

    యువ వికాసం :

    విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుకు హామీ ఇచ్చింది.

    చేయూత పథకం

    ప్రస్తుతం ఇస్తున్న పింఛన్‌లను రూ.4000 వేలకు పెంచను న్నట్లు ప్రచారం చేసింది. రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా ను కూడా 10 లక్షలు చేయబోతున్నట్టు వెల్లడించారు.

    వీటితోపాటు ప్రతి జిల్లాకు ప్రత్యేక డిక్లరేషన్ ఇచ్చ భారీ హామీలనే ఇచ్చింది కాంగ్రెస్. దీంతో వీటి అమలుపైనే ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి.

    ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీల అమలుపై ప్రజల సాక్షిగా కాంగ్రెస్ శ్రేణుల ముందు ఏఐసీసీ అగ్రనేతల సమక్షంలో ఆరు గ్యారంటీలపై సంతకం చేయనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    రేవంత్ రెడ్డి

    తాజా

    Sai Rajesh: బేబీ హిందీ రీమేక్ నుంచి 'బాబిల్ ఔట్'..? దర్శకుడు రాజేష్ స్పందన ఇదే! బాలీవుడ్
    PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి నరేంద్ర మోదీ
    Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయమొచ్చిందా..? ఆరుగురికి గ్రీన్ సిగ్నల్!  తెలంగాణ
    Citroen C3 CNG: పర్యావరణహిత వాహనాల్లో మరో అడుగు.. సిట్రోయెన్ C3 CNG వెర్షన్ ఆవిష్కరణ! ఆటో మొబైల్

    తెలంగాణ

    Telangana poll: తెలంగాణ పోలింగ్‌కు అంతా సిద్ధం.. ఈసీ ఏర్పాట్లు, నిబంధనలు ఇవే..  పోలింగ్
    Telangana Elections: తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్  ఓటు
    Telangana Elections: కట్టుదిట్టమైన భద్రత మధ్య 119 అసెంబ్లీ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్  ఎన్నికల సంఘం
    Telangana Elections : ఓటేసిన సినీ ప్రముఖులు.. క్యూలో నిల్చున్న ఎన్టీఆర్‌ ఫ్యామిలీ, అల్లు అర్జున్‌  ఎన్నికలు

    రేవంత్ రెడ్డి

    రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు భారీ ప్రమాదం; కార్లు ధ్వంసం కాంగ్రెస్
    ఎస్సీ, ఎస్టీలపై కాంగ్రెస్ వరాల జల్లు.. 12అంశాలతో డిక్లరేషన్‌ కాంగ్రెస్
    Alampur : అలంపూర్ లో బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్యెల్యే  బీఆర్ఎస్
    Congress: నేడు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ప్రచారం షెడ్యూల్ ఇదే  కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025