Page Loader
Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు
జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు

Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2025
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌ నిఘా సంస్థలకు భారత్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని అందిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా అరెస్టయ్యింది. ఆమె కేరళ పర్యటనపై ఆ రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు కె. సురేంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి పీఏ. మహమ్మద్‌ రియాస్‌ నేతృత్వంలో ఆమె పర్యటనకు టూరిజం డిపార్ట్‌మెంట్‌ స్పాన్సర్‌ ఇచ్చిందని పేర్కొన్నారు. కాగా, రియాస్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అల్లుడు కూడా. సురేంద్రన్‌ ఎక్స్‌ మీడియాకు తెలిపినట్లుగా, "పినరయి విజయన్‌ అల్లుడు రియాస్ నేతృత్వంలోని కేరళ పర్యాటక శాఖ పాకిస్థాన్‌ గూఢచారి జ్యోతి మల్హోత్రా కన్నూర్‌ పర్యటనకు స్పాన్సర్‌ ఇచ్చింది.

Details

హైకమిషన్ ఉద్యోగి డానిష్‌తో పరిచయం

ఆమె ఎవరిని కలిసింది? ఎక్కడికి వెళ్లింది? అసలు ఆమె పర్యటనలో ఏం అజెండా ఉంది? పాక్‌తో సంబంధాలు ఉన్న వ్యక్తి కేరళలో ఎక్కడా రెడ్ కార్పెట్‌ ఎందుకు వేసారని ప్రశ్నించారు. ట్రావెల్ బ్లాగర్‌, యూట్యూబర్‌ అయిన జ్యోతి మల్హోత్రా "Travel With Jo" అనే పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తోంది. 2023లో పాకిస్తాన్‌ పర్యటన సమయంలో ఆమెకు అక్కడి హైకమిషన్ ఉద్యోగి డానిష్‌తో పరిచయం అయ్యింది. తరువాత జ్యోతి ఆ దేశ గూఢచర్య సంస్థల ప్రతినిధులతో కూడా సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది. పాక్‌ గూఢచర్య ఆపరేషన్‌ "సిందూర్‌" సమయంలోనూ ఆమె డానిష్‌తో టచ్‌లో ఉండటం గుర్తించారు.

Details

పాకిస్తానీ ఇంటెలిజెన్స్‌ అధికారులతో సంబంధాలు

ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెను అరెస్టు చేసి, ఎన్‌ఐఏ, ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారులు విచారణ చేపట్టారు. ఇప్పటివరకు విచారణలో జ్యోతికి ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు, ఉగ్ర కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేశాడని ఏ విధమైన నిర్దిష్ట ఆధారాలు లేవని పోలీసులు చెప్పారు. అయితే, ఆమె స్వచ్ఛందంగా పాకిస్తానీ ఇంటెలిజెన్స్‌ అధికారులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలియడం గమనార్హం. ఇకపై, పాకిస్తాన్‌ నిఘా ఏజెంట్లకు భారతీయ మొబైల్‌ సిమ్‌కార్డులు అందజేస్తున్నట్టు ఆరోపణలతో కాసిమ్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Details

గతంలో కాసిమ్ సోదరుడు అరెస్టు

తాజాగా పాక్‌లోని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం బయటపడింది. ఈ వీడియోలో యాంకర్‌ కాసిమ్‌ను "మళ్ళీ పాక్‌కు స్వాగతం. ఇక్కడ తిరిగి రావడం ఎలా అనిపిస్తుంది?" అని ప్రశ్నించినప్పుడు, కాసిమ్‌ స్పందిస్తూ "ఇది నాకు సొంత ఇంటిలా అనిపిస్తుంది. ఇక్కడ నాకు చాలా ప్రేమ, ఆప్యాయత లభిస్తోంది. ఇది నాకు మళ్లీ ఇక్కడికి రావడానికి కారణమైందని చెప్పారు. కాగా, పాక్‌ గూఢచర్య ఆరోపణల నేపథ్యంలో కాసిమ్ సోదరుడు హసిన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.