LOADING...
CM Stalin: హోటల్ యజమాని క్షమాపణలు చెప్పడంపై సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు 
హోటల్ యజమాని క్షమాపణలు చెప్పడంపై సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు

CM Stalin: హోటల్ యజమాని క్షమాపణలు చెప్పడంపై సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2024
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడుకు చెందిన 'శ్రీ అన్నపూర్ణ రెస్టారంట్' యజమాని శ్రీనివాసన్‌ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి క్షమాపణలు చెప్పడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్రీనివాసన్‌తో బలవంతంగా క్షమాపణలు చెప్పించడం సిగ్గుచేటని, ఈ ఘటన ఎంతో నిరుత్సాహానికి గురి చేసిందని ఆయన మండిపడ్డారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రెస్టారంట్ల యజమానులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న శ్రీనివాసన్‌ పెరుగుతున్న జీఎస్టీపై ఆర్థిక మంత్రిని ప్రశ్నించారు. ఆయన రెస్టారంట్‌ యజమానులు ఎదుర్కొంటున్న సవాళ్లను నిర్మలా సీతారామన్‌కి తెలియజేశారు.

Details

నిర్మలా సీతారామన్‌ క్షమాపణలు చెప్పాలి

అయితే ఈ విషయంపై ఆర్థిక మంత్రికి క్షమాపణలు చెప్పడం పట్ల సోషల్‌ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఆ తర్వాత జరిగిన ఓ ప్రైవేట్‌ సమావేశంలో శ్రీనివాసన్‌ తానూ చేసిన వ్యాఖ్యలపై క్షమించాలంటూ నిర్మలా సీతారామన్‌కు క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తమిళనాడు బీజేపీ హ్యాండిల్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. ఆ వ్యక్తిపై కేంద్రం బెదిరింపులకు పాల్పడిందని, సీతారామన్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. ఈ వివాదంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండటంతో, తమిళనాడు బీజేపీ చీఫ్‌ కె అన్నామలై బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.