Page Loader
 Cockroach in Mutton Soup: మటన్ సూప్‌లో బొద్దింక.. అరేబియన్‌ మంది రెస్టారెంట్‌లో ఘటన
మటన్ సూప్‌లో బొద్దింక.. అరేబియన్‌ మంది రెస్టారెంట్‌లో ఘటన

 Cockroach in Mutton Soup: మటన్ సూప్‌లో బొద్దింక.. అరేబియన్‌ మంది రెస్టారెంట్‌లో ఘటన

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2025
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

రోజు రోజుకూ హైదరాబాద్‌లో ఆహార పదార్థాల నాణ్యత తగ్గుతోంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ, నాణ్యత ప్రమాణాలు పాటించని రెస్టారెంట్లను మూసివేస్తున్నారు. అయినప్పటికీ, కొన్ని రెస్టారెంట్ల యాజమాన్యాల్లో మార్పు కనిపించడం లేదు. తాజాగా, అహార పదార్థాల నాణ్యతలో లోపం వెలుగుచూసిన ఘటన ఒక్కసారి నగరవాసులను షాక్‌కు గురిచేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని సైనిక్‌పురిలో ఉన్న అరేబియన్ మంది రెస్టారెంట్‌కు ఓ కస్టమర్ వెళ్లాడు. ఆకలితో ఉన్న అతను మటన్ సూప్‌ను ఆర్డర్ ఇచ్చి వేచిచూస్తున్నాడు. అతని ఆర్డర్ వచ్చిన తర్వాత, తినేందుకు సిద్ధమైనప్పుడు అతనికి అంతలోనే షాక్‌ తగిలింది.

వివరాలు 

మటన్ ముక్కల బదులు బొద్దింక

మటన్ సూప్‌ను చెంచాతో కలిపి చూస్తే, అందులో మటన్ ముక్కల బదులు బొద్దింక కనిపించింది. ఊహించని ఈ దృశ్యం చూసి అవాక్కైన కస్టమర్ వెంటనే రెస్టారెంట్ యాజమాన్యానికి ఈ విషయాన్ని తెలియజేశాడు. అయితే, వారు దీన్ని సాధారణంగా తీసుకోవడంతో అతనికి మరింత కోపం వచ్చింది. ఈ ఘటనను సామాజిక కార్యకర్త రాబిన్ జక్కీయస్ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దీనిని గమనించిన సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. నగరంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయని, ఈ నిర్లక్ష్యం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు 

అహార భద్రతకు సంబంధించిన ఫిర్యాదుల కోసం..

హైదరాబాద్‌లోని రెస్టారెంట్లు పరిశుభ్రతా ప్రమాణాలను పాటించకపోవడం ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులను,సంబంధిత శాఖలను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అహార భద్రతకు సంబంధించిన ఫిర్యాదులను GHMC అధికారులకు తెలియజేయాలనుకుంటే, foodsafetywing.ghmc@gmail.com అనే మెయిల్ ఐడీకి పంపవచ్చు. అలాగే,040-21111111 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా X (ట్విట్టర్)ద్వారా GHMC అధికారులకు తమ సమస్యలను తెలియజేయవచ్చు. ఈ తరహా ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే,రెస్టారెంట్లు కఠినమైన పరిశుభ్రతా నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత రెస్టారెంట్ యాజమాన్యాలపై ఉందని ప్రజలు అంటున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సామాజిక కార్యకర్త రాబిన్ జక్కీయస్ చేసిన ట్వీట్