Cruise ship: చెన్నై-విశాఖ-పుదుచ్చేరి మధ్య క్రూయిజ్ నౌక సేవలు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది జూన్, జులై నెలల్లో పర్యాటకుల కోసం చెన్నై-విశాఖ-పుదుచ్చేరి మధ్య కార్డెల్లా క్రూయిజ్ నౌక సేవలు అందుబాటులోకి రానున్నాయి.
మొత్తం మూడు సర్వీసులుగా ఈ ప్రయాణం కొనసాగనుంది. మొదటి సర్వీసు జూన్ 30న చెన్నై నుంచి బయలుదేరి, జులై 2న విశాఖకు చేరుకుంటుంది.
అనంతరం అదే రోజు విశాఖ నుంచి పుదుచ్చేరికి బయలుదేరి, జులై 4న అక్కడ చేరుకుంటుంది.
జూలై 4న పుదుచ్చేరి నుంచి ప్రయాణం ప్రారంభించి, జులై 5న తిరిగి చెన్నై చేరుకుంటుంది.
Details
రెండో జులై 7 నుంచి ప్రారంభం
రెండో సర్వీసు జులై 7న చెన్నై నుంచి ప్రారంభమై, జులై 9న విశాఖకు చేరుతుంది. జులై 11న విశాఖ నుంచి బయలుదేరి, పుదుచ్చేరికి చేరుకుంటుంది.
అక్కడి నుంచి జులై 12న చెన్నైకి తిరిగి ప్రయాణిస్తుంది.
మూడో సర్వీసు జులై 14న చెన్నై నుంచి బయలుదేరి, జులై 16న విశాఖ చేరుకోనుంది. జులై 18న విశాఖ నుంచి పుదుచ్చేరికి చేరుకుని, జులై 19న తిరిగి చెన్నై చేరుకుంటుంది.