చట్నీ విషయంలో భర్త అలిగాడని.. ఉరేసుకున్న భార్య.. ఈ కేసుతో బండ్ల గణేష్‌కు లింకు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో దారుణం జరిగింది. చట్నీ విషయంలో భార్య భర్తల మధ్య గొడవ ఇల్లాలి ఆత్మహత్యకు దారితీసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలోని గోపతండాకు చెందిన రమణ.. ఖమ్మం జిల్లాలోని పెగళ్లపాడుకు చెందిన బానోతు చందన(25)ను 2సంవత్సరాల క్రితం ప్రేమవివాహం చేసుకున్నాడు.
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ వద్ద రమణ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
ఆదివారం రాత్రి సమయంలో భార్యాభర్తల మధ్య చట్నీ విషయంలో గొడవ జరిగింది.
చట్నీ ఎక్కువ వేశావని భార్యతో రమణ గొడవపడ్డాడు. ఈ క్రమంలో భార్యపై అలిగాడు.
సోమవారం ఉదయం రమణ విధులకు వెళ్లాడు. అయితే భార్య చాలాసార్లు వీడియోకాల్స్ చేసినా.. రమణ స్పందించలేదు.
ఆత్మహత్య
పోలీసులు అదుపులో బండ్ల గణేశ్ కారు డ్రైవర్ రమణ
ఈ క్రమంలో రమణకు నార్మల్ కాల్ చేసిన చందన.. తన తరుచూ గొడవ పడుతున్నావంటూ పెద్దగా అరిచింది. తాను చనిపోతున్నట్లు ఫోన్‌ను వెంటనే కట్ చేసింది.
అయితే అనుమానం వచ్చిన రమణ వెంటనే విషయాన్ని ఇంటి యజమానికి ఫోన్ చేసి చెప్పాడు.
త్వరగా ఇంటికి వెళ్లి చూడమని కోరాడు. యజమానితో పాటు ఇరుగుపొరుగువారి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. అప్పటికే చందన ఉరేసుకొని విగతజీవిగా కనిపించింది.
స్థానికుల సమాచారంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు.
అనంతరం బండ్ల గణేశ్ కారు డ్రైవర్, చందన భర్త రమణను వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
ఇద్దరూ బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో గల ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్నారు.