NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mallikarjun Kharge: మణిపూర్ పరిస్థితిపై జోక్యం చేసుకోవాలని ద్రౌపది ముర్ముకి కాంగ్రెస్ చీఫ్ లేఖ 
    తదుపరి వార్తా కథనం
    Mallikarjun Kharge: మణిపూర్ పరిస్థితిపై జోక్యం చేసుకోవాలని ద్రౌపది ముర్ముకి కాంగ్రెస్ చీఫ్ లేఖ 
    మణిపూర్ పరిస్థితిపై జోక్యం చేసుకోవాలని ద్రౌపది ముర్ముకి కాంగ్రెస్ చీఫ్ లేఖ

    Mallikarjun Kharge: మణిపూర్ పరిస్థితిపై జోక్యం చేసుకోవాలని ద్రౌపది ముర్ముకి కాంగ్రెస్ చీఫ్ లేఖ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 19, 2024
    05:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో కొంతకాలంగా మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

    రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని, వాటిని పునరుద్ధరించేందుకు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు.

    ఈ మేరకు ఆయన రెండు పేజీల లేఖ రాశారు. మణిపుర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఫిర్యాదు చేశారు.

    ప్రజల జీవితాలకు రక్షణ కల్పించేందుకు వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

    వివరాలు 

    మహిళలు,చిన్నారులు సహా 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు:ఖర్గే

    మణిపుర్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల కారణంగా ఇప్పటివరకు మహిళలు, చిన్నారులు సహా 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

    లక్షలాది మంది రోడ్డున పడ్డారన్నారు. కేవలం రాష్ట్రపతి జోక్యం చేసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని, మళ్లీ మణిపుర్ ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించగలుగుతారని లేఖలో పేర్కొన్నారు.

    వివరాలు 

    మణిపుర్‌ సీఎం రాజీనామా చేయాల్సిందే: ఇరోమ్‌ షర్మిల 

    రాష్ట్రంలో శాంతిభద్రతలు పునరుద్ధరించడంలో సీఎం బీరేన్‌ సింగ్‌ విఫలమయ్యారని పౌరహక్కుల నేత, మణిపుర్‌ ఉక్కు మహిళ ఇరోమ్‌ షర్మిల ధ్వజమెత్తారు.

    మణిపూర్ లో నెలకొన్న పరిస్థితులకు బాధ్యత వహించాలని.. వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

    రాష్ట్ర ప్రజల ఆకాంక్షను దృష్టిలో ఉంచుకొని, ఇక్కడ సమస్యల పరిష్కారం కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

    ఈ మేరకు ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు.

    వివరాలు 

    మోదీ జోక్యం చేసుకుంటేనే..

    మరోవైపు, కేంద్రం తీరును కూడా ఆమె తప్పుబట్టారు. మూడో సారి ఎన్నికైన తర్వాత ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటిస్తున్నారని, కానీ, మణిపుర్‌ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.

    ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని.. అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూడాలన్నారు.

    మోదీ జోక్యం చేసుకుంటేనే మణిపుర్‌ సంక్షోభానికి పరిష్కారం లభిస్తుందని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మల్లికార్జున ఖర్గే
    ద్రౌపది ముర్ము

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    మల్లికార్జున ఖర్గే

    సిద్ధరామయ్యను సీఎం చేసేందుకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు; మరి శివకుమార్ పరిస్థితి ఏంటి?  కర్ణాటక
    పొంగులేటి, జూపల్లి సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    బెంగుళూరులో జరగాల్సిన ప్రతిపక్షాల రెండో దఫా సమావేశం వాయిదా; కారణం ఇదే బెంగళూరు
    ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదు.. విపక్షాల భేటీలో ఖర్గే కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్

    ద్రౌపది ముర్ము

    74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు గణతంత్ర దినోత్సవం
    Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము రాష్ట్రపతి
    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కాంగ్రెస్ పాలనలో పదేళ్లను కోల్పోయాం, 2030వ దశకం భారత దశాబ్దం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025