Page Loader
Narendra Modi: మిత్రుడికి అభినందనలు.. ట్రంప్‌ విజయం పట్ల ప్రధాని మోదీ హర్షం
మిత్రుడికి అభినందనలు.. ట్రంప్‌ విజయం పట్ల ప్రధాని మోదీ హర్షం

Narendra Modi: మిత్రుడికి అభినందనలు.. ట్రంప్‌ విజయం పట్ల ప్రధాని మోదీ హర్షం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2024
02:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నందుకు నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌కు హృదయపూర్వక అభినందనలంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇక ఈ విజయం తర్వాత కూడా భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడతాయని, గ్లోబల్, వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

Details

ట్రంప్ దిగిన ఫోటోను షేర్ చేసిన మోదీ

ప్రజల జీవన స్థాయిని మెరుగుపర్చడంలో, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం ఇరు దేశాలు కలిసి పనిచేయడం కోసం కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. 'హౌడీ మోదీ' (అమెరికా), "నమస్తే ట్రంప్" (భారత్) కార్యక్రమాల ద్వారా వీరద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఈ సందర్భంలో, మోదీ తన ఎక్స్ ఖాతాలో గతంలో ట్రంప్‌తో దిగిన ఫోటోలను పంచుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్వీట్ చేసిన మోదీ