NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'కాంగ్రెస్, చైనా భాయ్ భాయ్'; రాహుల్ గాంధీపై బీజేపీ కౌంటర్ అటాక్
    భారతదేశం

    'కాంగ్రెస్, చైనా భాయ్ భాయ్'; రాహుల్ గాంధీపై బీజేపీ కౌంటర్ అటాక్

    'కాంగ్రెస్, చైనా భాయ్ భాయ్'; రాహుల్ గాంధీపై బీజేపీ కౌంటర్ అటాక్
    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 04, 2023, 10:34 am 1 నిమి చదవండి
    'కాంగ్రెస్, చైనా భాయ్ భాయ్'; రాహుల్ గాంధీపై బీజేపీ కౌంటర్ అటాక్
    రాహుల్ గాంధీపై బీజేపీ కౌంటర్ అటాక్

    కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఉపన్యాసం దేశం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. కేంద్రంలోని ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ అటాక్‌కు దిగింది. రాహుల్ మంగళవారం సాయంత్రం కేంబ్రిడ్జ్‌లో 'లెర్నింగ్ టు లిసన్ ఇన్ ది 21వ శతాబ్దం' అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా చైనాను పొడుగుతూ ఒక వ్యాఖ్య చేశారు. రెండో ప్రపంచ యుద్ధం నుంచి చైనా, అమెరికా విభిన్న కోణాల్లో అభివృద్ధి చెందాయని, సూపర్ పవర్‌గా ఎదిగాయాని రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ చైనాను పొగడటంపై బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్- చైనా భాయ్ భాయ్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

    విదేశీ గడ్డపై భారత్‌ను కించపర్చడం దురదృష్టకరం: అసోం సీఎం

    రాహుల్ వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత బిస్వా శర్మ ఘాటుగా స్పందించారు. మొదట విదేశీ ఏజెంట్లు మమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నారని, ఇప్పుడు సొంత దేశస్థులే పరాయి భూమిపై టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునే ముసుగులో విదేశీ గడ్డపై భారత్‌ను కించపర్చడం దురదృష్టకరం అన్నారు. గాంధీ కుటుంబం చైనా నుంచి తీసుకున్న విరాళాల అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. రాహుల్ నర్మగర్భంగా చైనా నిరంకుశత్వాన్ని సమర్థిస్తున్నారని బీజేపీ మరో నాయకుడు అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. చైనాపై రాహుల్ గాంధీ చేసిన చేసిన వ్యాఖ్యలు చిన్న పిల్లాడిలా ఉన్నాయని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడల్లా భారత్‌ను రాహుల్ అవమానిస్తున్నట్లు ఆరోపించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    హిమంత బిస్వా శర్మ
    చైనా
    రాహుల్ గాంధీ
    కాంగ్రెస్

    హిమంత బిస్వా శర్మ

    ప్రధాని మోదీ తండ్రి పేరును అపహాస్యం చేస్తే దేశం క్షమించదు: హిమంత శర్మ అస్సాం/అసోం
    నాకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడినా కేసు పెడతా: అసోం సీఎం హిమంత అస్సాం/అసోం

    చైనా

    దిల్లీలో జరిగే జీ20 సమావేశానికి చైనా హాజరు భారతదేశం
    The Wall Street Journal: చైనా ల్యాబ్‌ నుంచే కరోనా వ్యాప్తి; అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ నివేదిక కోవిడ్
    రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్‌; భారత్, చైనా దూరం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    వరుస భూకంపాలతో అల్లాడిపోయిన తజికిస్థాన్‌; విరిగిపడ్డ కొండచరియలు భూకంపం

    రాహుల్ గాంధీ

    భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: కేంబ్రిడ్జ్ ఉపన్యాసంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్
    Congress Plenary: అదానీ, మోదీ ఇద్దరూ ఒక్కటే; నిజం బయట పడేవరకూ ప్రశ్నిస్తూనే ఉంటాం: రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్
    కాంగ్రెస్ ప్లీనరీ: సీడబ్ల్యూసీకి ఎన్నికలు వద్దంటూ తీర్మానం; ఖర్గేకు బాధ్యత అప్పగింత కాంగ్రెస్
    కాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభం: స్టీరింగ్ కమిటీ సమావేశానికి సోనియా, రాహల్ గైర్హాజరు కాంగ్రెస్

    కాంగ్రెస్

    ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో కమల వికాసం; మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎన్‌పీపీ అసెంబ్లీ ఎన్నికలు
    కర్ణాటకలో 'PayCM' క్యూఆర్ కోడ్ పోస్టర్ల కలకలం; కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్ కర్ణాటక
    D Srinivas: సీనియర్ నాయకుడు డి. శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత తెలంగాణ
    Congress Plenary: పొలిటికల్ రిటైర్మెంట్‌పై సోనియా కీలక ప్రకటన; బీజేపీ పాలనపై ఫైర్ ఛత్తీస్‌గఢ్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023