Congress Plenary: అదానీ, మోదీ ఇద్దరూ ఒక్కటే; నిజం బయట పడేవరకూ ప్రశ్నిస్తూనే ఉంటాం: రాహుల్ గాంధీ
ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ మూడో రోజుకు చేరుకున్నాయి. ముగింపు సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదాని-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. పార్లమెంట్‌లో అదానికి బీజేపీ నేతలు ఎందుకు రక్షణగా నిలిచారని ప్రశ్నించారు. గౌతమ్ అదానీ, ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరూ ఒక్కటే అని ఆరోపించారు. అదాని వ్యవహారంలో నిజం బయటకు వచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. దశ స్వాతంత్య్ర పోరాటం కూడా ఒక కంపెనీకి వ్యతిరేకంగా జరిగిందని రాహుల్ పేర్కొన్నారు. అది దేశంలోని సంపద, ఓడరేవులను స్వాధీనం చేసుకుందని పేర్కొన్నారు. ఇప్పుడు చరిత్ర పునరావృత కాబోతోందని రాహల్ వెల్లడించారు. అదాని గ్రూప్ వల్ల దేశాన్ని బాధిస్తోందని వివరించారు.
భారత్ జోడో యాత్రలో నేను చాలా నేర్చుకున్న: రాహుల్
భారత్ జోడో యాత్రలో తాను చాలా నేర్చుకున్నట్లు రాహుల్ గాంధీ వివరించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దేశం కోసం తాను నడిచానన్నారు. యాత్రలో వేలాదిమందితో మాట్లాడినట్లు చెప్పారు. తాను రైతుల బాధలు విన్నానని, అన్ని సమస్యలను తెలుసుకున్నానని వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చైనా కంటే భారత ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నదిని, వారితో పోరాడలేమని ఇటీవల జైశంకర్ వ్యాఖ్యానించారు. దానికి ఇప్పుడు రాహుల్ కౌంటర్ ఇచ్చారు. బలవంతుడి ముందు తలవంచడం సావర్కర్ సిద్ధాంతమన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ భరత్ కంటే పెద్దది కాబట్టి వారతో మనం వారితో పోరాడలేమని మంత్రి చెప్పడం జాతీయవాదం కాదని, పిరికితనం అవుతుందని చెప్పారు.