
Congress Plenary: పొలిటికల్ రిటైర్మెంట్‌పై సోనియా కీలక ప్రకటన; బీజేపీ పాలనపై ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశంలో శనివారం యూపీఏ చైర్‌పర్సన్, పార్టీ అగ్రనేత సోనియా గాంధీ మాట్లాడారు. దేశంలోని ప్రతి ఒక్క రాజ్యాంగ సంస్థను బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు నాశనం చేశాయని ఆరోపించారు.
ప్రస్తుత సమయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని సోనియా చెప్పారు. దేశంలోని ఒక్కో సంస్థను బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ స్వాధీనం చేసుకున్నాయని వివరించారు. కొంతమంది వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించడం ద్వారా ఆర్థిక వినాశనానికి ఎన్డీయే కారణమైనట్లు పేర్కొన్నారు.
అలాగే తన పొలిటికల్ రిటైర్మెంట్‌పై కూడా యూపీఏ చైర్‌పర్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రతో విజయవంతంతో తన పొలిటికల్ ఇన్నింగ్స్ ముగియవచ్చు చెప్పారు.
కాంగ్రెస్
'భారత్ జోడో యాత్ర' కాంగ్రెస్‌కు కీలక మలుపు: సోనియా
డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2004, 2009లో తమ విజయాలు వ్యక్తిగత సంతృప్తినిచ్చినట్లు సోనియా గాంధీ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర అనేది కాంగ్రెస్‌కు కీలక మలుపు లాంటిదని చెప్పారు. భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం తనకు చాలా సంతోషాన్ని కలిగించిందన్నారు.
అంతకు ముందు పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కూడా సమావేశంలో ప్రసంగించారు. భారత్ జోడో యాత్ర దేశానికి సూర్యకాంతి లాంటిదన్నారు. వేలాది మంది రాహుల్ గాంధీతో చేతులు కలిపారని, కాంగ్రెస్ ఇప్పటికీ తమ గుండెల్లో ఉందని నిరూపించారని స్పష్టం చేశారు. యువతకు రాహుల్ స్ఫూర్తినిచ్చారని ఖర్గే అన్నారు.
ఈ ప్లీనరీ సమావేశాన్ని ఆపడానికి, తమ పార్టీ కార్యకర్తల నివాసాలపై బీజేపీ దాడి చేయించిందని వివరించారు.