Congress: కాంగ్రెస్ పార్టీ కి ఊహించని షాక్.. పార్టీకి చెందిన బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేసిన ఐటీ శాఖ
లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన బ్యాంకు అకౌంట్లను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసినట్లు ట్రజరర్ అజయ్ మాకెన్ వెల్లడించారు. 'మా చెక్కులను బ్యాంకులు క్లియర్ చెయ్యడం లేదు.అకౌంట్లు ఫ్రీజ్ చేశారని తెలిసింది.ప్రస్తుతం మా వద్ద నిధులు లేవు.ఇది మా పార్టీ కార్యకలాపాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలా చేయడం రాజ్యాంగంపై ఆంక్షలు విధించడం లాంటిదే'అని మండిపడ్డారు. ఆ పార్టీ బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసినట్లు కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ శుక్రవారం తెలిపారు. మీడియా సమావేశంలో మాకెన్ మాట్లాడుతూ, యూత్ కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాను కూడా స్తంభింపజేసినట్లు చెప్పారు.
విద్యుత్ బిల్లులు,మా ఉద్యోగులకు జీతాలకి నిధులు లేవు : మాకెన్
"ప్రస్తుతం విద్యుత్ బిల్లులు,మా ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి మా వద్ద నిధులు లేవు.ఇది మా పార్టీ కార్యకలాపాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలా చేయడం రాజ్యాంగంపై ఆంక్షలు విధించడం లాంటిదే..' అని మాకెన్ అన్నారు. కేంద్రం ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని "రాజ్యాంగ విరుద్ధం" అని పేర్కొంటూ అనామక రాజకీయ నిధుల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. బాండ్ దాతలు, మొత్తం గ్రహీతల వివరాలను మార్చి 13లోగా వెల్లడించాలని కోర్టు ఆదేశించింది.