KTR: కర్ణాటక నుండి తెలంగాణకు కాంగ్రెస్ కరెన్సీ కట్టలు.. కేటీఆర్ ట్వీట్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కర్ణాటక నుంచి వందల కోట్ల రూపాయలను పంపిస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. ఓటుకు నోటు కుంభకోణంలో నాడు లంచం ఇస్తూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు దొంగల ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడని కేటీఆర్ విమర్శలు చేశాడు. ఇక తెలంగాణలో 'స్కామ్ గ్రెస్' కు చోటు లేదని చెబుదామంటూ ట్వీట్‌లో మంత్రి పేర్కొన్నాడు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ నుంచి చేసిన మరో ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన డబ్బును తెలంగాణ ఎన్నికల్లో ప్రలోభాల కోసం తరలిస్తూ కాంగ్రెస్ నేతలు దొరికిపోయారని బీఆర్ఎస్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశాడు.