LOADING...
Delhi Nyay Yatra: నేడు రాజ్‌ఘాట్ నుంచి ప్రారంభం కానున్న కాంగ్రెస్ ఢిల్లీ 'న్యాయ యాత్ర '
నేడు రాజ్‌ఘాట్ నుంచి ప్రారంభం కానున్న కాంగ్రెస్ ఢిల్లీ 'న్యాయ యాత్ర '

Delhi Nyay Yatra: నేడు రాజ్‌ఘాట్ నుంచి ప్రారంభం కానున్న కాంగ్రెస్ ఢిల్లీ 'న్యాయ యాత్ర '

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 08, 2024
08:25 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ తన సన్నాహాలను వేగవంతం చేసింది. ఢిల్లీ రాష్ట్ర కాంగ్రెస్ ఈ రోజు నుంచి రాజ్‌ఘాట్ నుంచి ఢిల్లీ న్యాయ యాత్రను ప్రారంభించనుంది. నెల రోజులు సాగనున్న ఈ యాత్రలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయనున్నారు. యాత్ర మొత్తం 360 కి.మీ దూరం ప్రయాణిస్తుందని అంచనా. ఈ యాత్రకు ఢిల్లీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ నాయకత్వం వహించనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ మాట్లాడుతూ, నవంబర్ 8న ప్రారంభమయ్యే ఈ యాత్ర మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా కొనసాగుతుందని తెలిపారు.

వివరాలు 

మైనారిటీ ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై కాంగ్రెస్ దృష్టి

ఈ యాత్ర ద్వారా ఢిల్లీ పౌరుల సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దాదాపు నెల రోజుల పాటు కొనసాగే ఈ యాత్రలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొంటారని తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు రాజ్‌ఘాట్ వద్ద ప్రారంభమయ్యే యాత్ర, పాత ఢిల్లీ తుర్క్‌మన్ గేట్, బల్లిమారన్ వంటి ప్రాంతాల మీదుగా సాగుతుంది. మొదటి రోజు మైనారిటీ ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. గత రెండు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన పోటీ చూపించి, కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనిచ్చింది.