HARISH RAO : రంగంలోకి మంత్రి హరీశ్ రావు.. బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్ గా మారుతున్నాయి. ఓ వైపు ఎన్నికల కోడ్, మరోవైపు పార్టీలకు చెందిన నేతల జంపింగ్స్, వెరసి రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.
ఈ క్రమంలోనే మల్కాజిగిరి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంత రావుకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ వేగంగా పావులు కదుపుతోంది.ఈ మేరకు మంత్రి హరీశ్ రావు ఆహ్వానంతో పట్లోళ్ల శశిధర్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళ్లనున్నారు.
అధికార పార్టీని వీడి, ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరిన మైనంపల్లికి మెదక్ రాజకీయాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి.
మైనంపల్లి హస్తం పార్టీలో చేరాక డీసీసీ చీఫ్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి రాజీనామా చేసి, బిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.కంఠారెడ్డి నివాసానికి స్వయంగా వెళ్లిన మంత్రి హరీష్ ఆయన్ను ఒప్పించి గులాబీ గూటికి చేర్చారు.
details
స్వయంగా పట్లోళ్ల ఇంటికెళ్లిన మంత్రి హరీశ్
తాజాగా అదే పంథాలో పట్లోళ్ల శశిధర్ రెడ్డి ఇంటికీ మరోసారి స్వయంగా వెళ్లిన మంత్రి హరీశ్ తమ పార్టీలో చేరాలని అభ్యర్థించారు.
గులాబీ గూటికి వస్తే, మంచి గుర్తింపు ఇస్తామని, రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ పదవి అప్పగిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం.
2004లో కాంగ్రెస్ తరపున మెదక్ ఎమ్మెల్యేగా గెలిచిన శశిధర్ రెడ్డి, 2009లో మైనంపల్లి చేతిలో ఓటమిపాలయ్యారు.
2014లో కాంగ్రెస్ మెదక్ సీటు విజయశాంతికి ఇవ్వటంతో శశిధర్ నిరాశకు గురయ్యారు. 2018లో ఉపేందర్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వడంతో బీజేపీలో చేరాడు.
2023 మేలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనకే టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి పార్టీలోకి ఆహ్యానించారు. ఇంతలో మైనంపల్లి కాంగ్రెస్ రేసులోకి రావడంతో శిశిధర్ టిక్కెట్ అటకెక్కింది.