
Congress: కాంగ్రెస్ కు ఉపశమనం.."స్తంభింపజేసిన" బ్యాంక్ ఖాతాల పునరుద్ధరణ
ఈ వార్తాకథనం ఏంటి
లోక్‌సభ ఎన్నికల ముందు యూత్ కాంగ్రెస్ సహా పార్టీ బ్యాంకు ఖాతాలను ఆదాయపు పన్ను శాఖ స్తంభింపజేసిందని కాంగ్రెస్ ఈరోజు ప్రకటించింది.
అయితే, కాంగ్రెస్ ప్రకటన చేసిన ఒక గంట తర్వాత.. దిల్లీలోని ఆదాయపన్ను శాఖ అప్పిలేట్ ట్రైబ్యునల్ వాటిని పునరుద్ధరించింది.
మీడియా సమావేశంలో మాకెన్ మాట్లాడుతూ,యూత్ కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాను కూడా స్తంభింపజేసినట్లు చెప్పారు.ఇలా చేయడం రాజ్యాంగంపై ఆంక్షలు విధించడం లాంటిదే అన్నారు. యూత్ కాంగ్రెస్,కాంగ్రెస్ పార్టీల నుండి ఆదాయపు పన్ను 210కోట్ల రూపాయలు రికవరీ నిమిత్తం ఫ్రీజ్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో ఉన్నందున,స్తంభింపజేయడంపై పార్టీ చట్టపరమైన చర్యలు తీసుకుందని కాంగ్రెస్ నాయకుడుమాకెన్ తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
"స్తంభింపజేసిన" బ్యాంక్ ఖాతాలు ఇప్పుడు పని చేస్తున్నాయి
In Relief For Congress, "Frozen" Bank Accounts Now Working https://t.co/WLefPaaHYE
— NDTV (@ndtv) February 16, 2024
Sunil Prabhu reports pic.twitter.com/WXaol3GnB6