New Ration Cards : తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. కొత్త రేషన్ కార్డులు జారీ చేసేది ఎప్పుడంటే?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుతోంది. తాము అధికారంలోకి వస్తే అర్హులైనవారందరికీ కొత్త కార్డులను జారీ చేస్తామని గతంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ అధికారులతో సమీక్షించనున్నారు. ఈ సమీక్షా అనంతరం కొత్త కార్డుల జారీకి కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. కాంగ్రెస్ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే లబ్ధిదారులకు రేషన్ కార్డు తప్పనిసరి. దీంతో కొత్త రేషన్ కార్డు కోసం చాలా కుటుంబాలు అతృతుగా ఎదురుచూస్తున్నాయి.
తెలంగాణలో 90.14 లక్షల రేషన్ కార్డులు
దాదాపు 9ఏళ్ల నుంచి తెలంగాణ కొత్త రేషన్ కార్డులను జారీ చేశారు. ఈ నేపథ్యంలో లక్షల్లో దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. అలాగే పాత కార్డుల్లో కొత్త కుటుంబ సభ్యుల పేర్లను చేర్చేందుకు కూడా భారీగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 1.25 లక్షల రేషన్ కార్డుల దరఖాస్తులు పౌరసరఫరాల శాఖకు అందాయి. తెలంగాణలో ప్రస్తుతం 90.14 లక్షల రేషన్ కార్డులున్నాయి. వీటిలో అంత్యోదయ అన్నయోజన పథకం కింద 5.62 లక్షల కార్డులు ఉన్నాయి. రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా పథకం, విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా పథకం అందాలన్న రేషన్ కార్డు తప్పనిసరి. దీంతో అర్హులు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు.