Page Loader
congress: అమెరికాలో అదానీపై కేసు.. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుచేయాలని కాంగ్రెస్ డిమాండ్
అమెరికాలో అదానీపై కేసు.. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుచేయాలని కాంగ్రెస్ డిమాండ్

congress: అమెరికాలో అదానీపై కేసు.. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుచేయాలని కాంగ్రెస్ డిమాండ్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2024
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

బిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు అదానీ గ్రూప్‌ ఛైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్‌లో నమోదైన కేసుపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. అదానీ గ్రూప్‌ పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) ఏర్పాటు చేయాలని మరోసారి డిమాండ్ చేసింది. "మోదానీ" స్కాంపై 2023 జనవరి నుండి జేపీసీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ నేతలు అభ్యర్థిస్తున్నారు. "హమ్ అదానీ కె హై" సిరీస్‌లో ఇప్పటి వరకు వందలాది ప్రశ్నలు సంధించినప్పటికీ, ఇప్పటివరకు వాటికి సమాధానాలు రాలేదని హస్తం పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్‌ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జైరాం రమేశ్‌ చేసిన ట్వీట్ 

వివరాలు 

20 సంవత్సరాలలో 2 బిలియన్ డాలర్ల లాభం

అదానీ, దాని అనుబంధ సంస్థలు గత 20 సంవత్సరాలలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందేందుకు సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందినట్లు, భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల లంచాలు చెల్లించినట్లు న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. దీనితో పాటు, అమెరికా,అంతర్జాతీయ మదుపర్లను తప్పుదారి పట్టించి, తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా నిధులను సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నించిందని పేర్కొంది. అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ అక్రమ మార్గాలలో రూ. 3 బిలియన్‌ డాలర్ల మేర రుణాలు, బాండ్లు సేకరించిందని న్యూయార్క్‌ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు.

వివరాలు 

అదానీ సంస్థపై కాంగ్రెస్‌ కొద్దికాలంగా ఆరోపణలు

ఈ వ్యవహారం ప్రస్తుతం బాగా సంచలనంగా మారింది. అదానీ సంస్థపై కాంగ్రెస్‌ కొద్దికాలంగా ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం చేస్తూ, సామాన్యుల జీవితాలు ఇబ్బందికరంగా మారుతున్నప్పుడు, పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ ఖాతాలోకి మాత్రం డబ్బులు వర్షంలా పడుతున్నాయని విమర్శలు చేయడం జరిగింది.