Lok Sabha Elections 2024: ప్రియాంకతో కలిసి వయనాడ్ లో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ
కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్‌లో రోడ్ షో నిర్వహించారు. ఆయన రోడ్ షోలో భారీగా జనం తరలివచ్చారు. ఈ సమయంలో ప్రియాంక గాంధీ కూడా ఆయన వెంటే ఉన్నారు.ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ నేను ఐదేళ్ల క్రితం వయనాడ్‌కు వచ్చానని,ఆ సమయంలో కొత్తగా వచ్చిన నన్ను మీ కుటుంబంలో సభ్యుడిగా చేసుకున్నారన్నారు. వాయనాడ్‌లోని ప్రతి వ్యక్తి ప్రేమ, ఆప్యాయత, గౌరవంతో స్వంత వ్యక్తిగా చూసుకున్నారని మరోసారి ఎంపీగా గెలిపించాలని కోరారు.
దాదాపు 5లక్షల ఓట్లతో గెలిచిన రాహుల్ గాంధీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్ ఇక్కడి నుంచి పోటీ చేశారు.వాయనాడ్‌లో రెండో దశలో ఓటింగ్ జరగనుంది. ఏప్రిల్ 26న అక్కడ ఓటింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి పీపీ సునీల్ పై రాహుల్ గాంధీ పోటీ చేశారు.అయితే ఇక్కడ రాహుల్ గాంధీ దాదాపు 5లక్షల ఓట్లతో గెలుపొందారు. ఈసారి ఆయన బీజేపీ అభ్యర్థి కే సురేంద్రన్‌తో తలపడుతున్నారు.ప్రస్తుతం కేరళ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే భారతీయ జనతా యువమోర్చా వాయనాడ్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన రాజకీయాలు ప్రారంభించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కె. సురేంద్రన్ పతనంతిట్ట నుంచి పోటీ చేసినా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.