Page Loader
Madhya Pradesh Congress Manifesto: ఉచిత విద్యుత్, రూ.25లక్షల ఆరోగ్య రక్షణ.. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే 
ఉచిత విద్యుత్, రూ.25లక్షల ఆరోగ్య రక్షణ.. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే

Madhya Pradesh Congress Manifesto: ఉచిత విద్యుత్, రూ.25లక్షల ఆరోగ్య రక్షణ.. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే 

వ్రాసిన వారు Stalin
Oct 17, 2023
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భోపాల్‌లో కాంగ్రెస్ పార్టీ 'వచన్ పాత్ర'తో తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఓటర్లను ఆకర్షించేందుకు కీలక హామీలను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పొందుపర్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో కుల గణన పాత పెన్షన్ స్కీమ్ (OPS)ను పునరుద్ధరణ 100యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మహిళలకు నెలకు రూ.1,500సాయం ఎల్‌పీజీ సిలిండర్ రూ.500 రాష్ట్రంలోకి ప్రజలందరికీ రూ. 25 లక్షల చొప్పున ఆరోగ్య బీమా ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు మధ్యప్రదేశ్‌కు ఒక ఐపీఎల్ టీమ్ ఉండేలా చొరవ ప్రమాదవశాత్తూ రూ.10లక్షల బీమా రూ.2లక్షల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ యువతకు రెండేళ్లపాటు నిరుద్యోగ భృతి

కాంగ్రెస్

106 పేజీల మేనిఫెస్టోలో 59 వాగ్దానాలు

కాంగ్రెస్ తన 106 పేజీల మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులతో సహా సమాజంలోని అన్ని వర్గాలను ఆకట్టుకునేలా 59 వాగ్దానాలను పొందుపర్చింది. మేనిఫెస్టో ఆవిష్కరణ సభలో మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కమల్‌నాథ్‌, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ శాసనసభకు నవంబర్ 17న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. 230 శాసనసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ప్రతిపక్ష కాంగ్రెస్ ఇప్పటివరకు 144 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించిన, ఆధికారాన్నినిలబెట్టుకోలేకపోయింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 మేనిఫెస్టోను విడుదల చేస్తున్న కాంగ్రెస్ నేతలు