Page Loader
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి అస్వస్థత; ఆస్పత్రిలో చేరిక
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి అస్వస్థత

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి అస్వస్థత; ఆస్పత్రిలో చేరిక

వ్రాసిన వారు Stalin
Mar 03, 2023
03:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ దిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని శుక్రవారం ఆసుపత్రి వర్గాలు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి. జ్వరం కారణంగా సోనియా గాంధీ గురువారం ఆసుపత్రిలో చేరినట్లు సర్ గంగా రామ్ హాస్పిటల్ ట్రస్ట్ సొసైటీ ఛైర్మన్ డీఎస్ రాణా తెలిపారు. చెస్ట్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ అరుప్ బసు, అతని బృందం పర్యవేక్షణలో వైద్యం చేస్తున్నట్లు రాణా వెల్లడించారు.

సోనియా గాంధీ

ఈ ఏడాది ఆస్పత్రిలో చేరడం ఇది రెండోసారి

సోనియా గాంధీ అబ్జర్వేషన్‌లో ఉన్నారని, వైద్య పరీక్షలు చేస్తున్నట్లు సర్ గంగా రామ్ హాస్పిటల్ ఛైర్మన్ రాణా వెల్లడించారు. ఈ ఏడాది ఆమె ఆస్పత్రిలో చేరడం ఇది రెండోసారి. జనవరిలో సోనియా గాంధీ వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌తో చికిత్స కోసం దిల్లీ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఉత్సాహంగా పాల్గొన్న సోనియా గాంధీ, తన రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ఇన్నింగ్స్‌ను భారత్ జోడో యాత్రతో ముగించడం సంతోషంగా ఉందని చెప్పడం గమనార్హం.