NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీ ప్రభుత్వంలో కొత్త మంత్రులు; సౌరభ్ భరద్వాజ్, అతిషికి అవకాశం
    తదుపరి వార్తా కథనం
    దిల్లీ ప్రభుత్వంలో కొత్త మంత్రులు; సౌరభ్ భరద్వాజ్, అతిషికి అవకాశం
    దిల్లీ ప్రభుత్వంలో కొత్త మంత్రులు; సౌరభ్ భరద్వాజ్, అతిషికి అవకాశం

    దిల్లీ ప్రభుత్వంలో కొత్త మంత్రులు; సౌరభ్ భరద్వాజ్, అతిషికి అవకాశం

    వ్రాసిన వారు Stalin
    Mar 01, 2023
    03:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన తర్వాత వారి స్థానంలో సౌరభ్ భరద్వాజ్, అతిషిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం కేజ్రీవాల్ నిర్ణయించారు. ఈ మేరకు వారి పేర్లను లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపారు.

    సత్యేందర్ జైన్ గతేడాది మనీ లాండరింగ్ కేసులో అరెస్టు అయ్యాడు. అప్పటి నుంచి అతని శాఖలను సిసోడియాకు అప్పగించారు. అప్పటి నుంచి సిసోడియా దాదాపు 18శాఖలను నిర్వర్తిస్తున్నారు. తాజాగా సిసోడియా కూడా అరెస్టు కావడంతో కేజ్రీవాల్‌కు మంత్రి వర్గ విస్తరణ అనివార్యమైంది.

    ఈ క్రమంలోనే పార్టీలో యాక్టివ్‌గా ఉండే సౌరభ్ భరద్వాజ్, అతిషిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేజ్రీవాల్ నిర్ణయించారు.

    సౌరభ్ భరద్వాజ్ గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండగా, అతిషి కల్కాజీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

    దిల్లీ

    సిసోడియా, జైన్‌ల రాజీనామాలను ఆమోదించాలని రాష్ట్రపతికి సిఫార్సు చేసిన ఎల్జీ

    దిల్లీ మంత్రివర్గం చాలా చిన్నదని, చాలా ముఖ్యమైన శాఖలను సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా నిర్వహించేవారని సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. పని పరంగా వెనుకబడి ఉండకుండా ఉండటానికి, త్వరలో ఇద్దరు కొత్త మంత్రులను కేజ్రీవాల్ నియమించనున్నారని భరద్వాజ్ మంగళవారం చెప్పారు. భరద్వాజ్ చెప్పినట్లుగానే కేజీవాల్ ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు.

    సిసోడియా, జైన్‌ల రాజీనామాలను ఆమోదించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు దిల్లీ ఎల్‌జీ సిఫార్సు చేశారు. వారి రాజీనామాలను కేజ్రీవాల్ మంగళవారం ఆమోదించారు.

    2013 అసెంబ్లీ ఎన్నికల పార్టీ మ్యానిఫెస్టో ముసాయిదా కమిటీలో అతిషి కీలక సభ్యురాలు. అతిషి విద్యా మంత్రిత్వ శాఖలో మనీష్ సిసోడియా సలహాదారుగా పనిచేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ప్రభుత్వం
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    అరవింద్ కేజ్రీవాల్

    తాజా

    Vijayawada: రూ.850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్‌‌కు మహర్దశ.. ఆధునికీకరించేందుకు నీతి ఆయోగ్‌ ఆమోదం విజయవాడ సెంట్రల్
    Kuppam: కుప్పంలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి కారు.. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన గ్రామీణ సీఐ కుప్పం
    Kuldeep Yadav: చిన్న నాటి స్నేహితురాలు వంశికతో కుల్‌దీప్ యాదవ్ నిశ్చితార్థ వేడుక కుల్దీప్ యాదవ్
    Donald Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులపై నిషేధం  డొనాల్డ్ ట్రంప్

    దిల్లీ

    ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్‌ను ప్రకటించిన కేంద్రం, ఏపీకి విశిష్ట సేవా పురస్కారాలు గణతంత్ర దినోత్సవం
    74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు గణతంత్ర దినోత్సవం
    గణతంత్ర వేడుకలు: ప్రత్యేక ఆకర్షణగా ప్రధాని మోదీ తలపాగా- దేశంలో వైవిధ్యానికి ప్రతీక నరేంద్ర మోదీ
    నేడు దిల్లీ యూనివర్శిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన నరేంద్ర మోదీ

    ప్రభుత్వం

    'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా? భారతదేశం
    BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లు నిషేదించిన ఢిల్లీ ప్రభుత్వం భారతదేశం
    బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు బడ్జెట్
    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు దిల్లీ
    దిల్లీ లిక్కర్ స్కామ్‌: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు దిల్లీ
    పవర్ డిస్కమ్ బోర్డుల నుంచి ఆప్ నామినీలను తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్ దిల్లీ
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ దిల్లీ

    అరవింద్ కేజ్రీవాల్

    దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వాదించేందుకు లాయర్లకు ఆప్ ప్రభుత్వం రూ.కోట్ల ఫీజు చెల్లింపు దిల్లీ
    కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    దిల్లీ: 'మీకు వడ్డించడం అంటే చాలా ఇష్టం', కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ కౌంటర్ దిల్లీ
    దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025