
Telangana: నేడు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం..మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఎన్నికల్లో 64 స్థానాల్లో విజయదుందుభి మోగించిన కాంగ్రెస్ ఇవాళ ఉదయం సీఎల్పీ సమావేశం నిర్వహించారు.
అందులో భాగంగానే ఇవాళ రాత్రి తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ క్రమంలోనే రాజ్భవన్లో నూతన సీఎం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అంతకుముందు రాష్ట్ర ఎన్నికల ముఖ్యఅధికారి- సీఈఓ వికాస్ రాజ్, ఈసీ ముఖ్య కార్యదర్శి అవినాష్, గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ తమిళిసైకి అందించారు.
దీంతో ప్రస్తుత శాసనసభను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు సభ రద్దు ప్రతులను గవర్నర్'కు అసెంబ్లీ కార్యదర్శి నరసింహా చారి అందించారు.
మరోవైపు తెలంగాణ మూడో శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
ప్రస్తుత శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ తమిళ్ సై సర్క్యులర్ జారీ
— HEMA (@Hema_Journo) December 4, 2023
కొద్ది సేపటి క్రితమే శాసనసభ రద్దు ప్రతలను గవర్నర్ కు అందించిన అసెంబ్లీ సెక్రెటరీ నరసింహ చారి pic.twitter.com/z81wxqy5l3