ప్రవల్లికది ఆత్మహత్య కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వ హత్య: రాహుల్ గాంధీ ఆగ్రహం
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల వాయిదాపై తీవ్ర మానసిక ఆందోళనతో ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడటంపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవల్లిక ఆత్మహత్య బాధాకరం, ప్రవల్లికది ఆత్మహత్య కాదు, హత్యని రాహుల్ అన్నారు. తెలంగాణ నిరుద్యోగంతో విలవిలలాడుతోందని, ఈ మేరకు బీఆర్‌ఎస్, బీజేపీ కలిసే రాష్ట్రాన్ని నాశనం చేశాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, ఉద్యోగాలకు క్యాలెండర్‌ను విడుదల చేస్తామన్నారు. ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ప్రవల్లిక మృతి తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఖర్గే అన్నారు. పరీక్షలను అదే పనిగా వాయిదా వేయడం, నిర్వహణలో అవకతవకలతోనే ప్రవల్లిక బలవన్మరణానికి ఒడిగట్టిందన్నారు. తెలంగాణ యువత, అవినీతిమయమైన, అసమర్థమైన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె నుంచి దించాలని కోరారు.