
Congress Victory factors: తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు దోహదపడ్డ 6 కీలక అంశాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుపు విజయాన్ని అందుకుంది. 64స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను సాధించింది.
10ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ను ఓడించి.. తెలంగాణలో తొలిసారి అధికారం చేపట్టబోతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి 6 ముఖ్యమైన కారణాలను ఓసారి పరిశీలిద్దాం.
1.ఆరు గ్యారంటీలు
ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించిన 'ఆరు గ్యారంటీలు' పార్టీ గెలుపును బలంగా దోహదపడ్డాయి.
మహిళల కోసం 'మహాలక్ష్మి', రైతులో కోసం 'రైతు భరోసా', పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు 'గృహజ్యోతి', విద్యుత్ బిల్లులపై రాయితీలు, యువకుల కోసం 'యువ వికాసం' హామీలు ఆయా వర్గాల ప్రజలను ఆకట్టుకున్నాయి.
కాంగ్రెస్
ఫలించిన మైనారిటీ డిక్లరేషన్ వ్యూహం
2. కాంగ్రెస్ వైపు మొగ్గిన మైనారిటీ ఓటర్లు
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మైనారిటీ డిక్లరేషన్ ఆ వర్గాన్ని విపరీతంగా ఆకట్టుకుంది.
మైనారిటీ సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ముస్లిం ఓటర్ల మద్దతును కాంగ్రెస్ భారీగా పొందింది.
గతంలో ఎంఐఎంకు వేసిన మైనార్టీ ఓటర్లు కూడా ఈసారి కాంగ్రెస్ వైపు మళ్లినట్లు.. ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలించినప్పుడు స్పష్టమైంది.
3. కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత
కేసీఆర్ ప్రభుత్వం గత పదేళ్లుగా అధికారంలో ఉన్న నేపథ్యంలో తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చింది.
ప్రభుత్వ వ్యతిరేకత వల్ల.. ఇన్నాళ్లు బీఆర్ఎస్‌కు అండగా ఉన్న.. గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని ఓటర్లు ఈసారి కాంగ్రెస్ వైపు మళ్లీనట్లు స్పష్టమవుతోంది.
కాంగ్రెస్
4. కాంగ్రెస్‌కు కలిసొచ్చిన బండి జంజయ్ మార్పు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించడం కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చింది.
జూలైలో బండి సంజయ్‌ను అధ్యక్షడిగా తొలగించి, జి.కిషన్ రెడ్డిని అధిష్టానం నియమించింది. దీంతో అప్పటి దాకా రాష్ట్రంలో బీజేపీకి ఉన్న గ్రాఫ్.. అమాంతం తగ్గిపోయింది.
దీంతో అప్పటికే తెలంగాణలో రెండోస్థానంలో ఉన్న బీజేపీ.. బండి సంజయ్ తొలగింపు తర్వాత మూడోస్థానానికి పడిపోయింది. ఇది కాంగ్రెస్ తిరిగి పుంజుకోవడానికి దోహదపడింది.
5.బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు
జులై-నవంబర్ వరకు కేసీఆర్‌పై కాంగ్రెస్ అనేక ఆరోపణలు చేసింది.
సరిగ్గా కాళేశ్వరంలో ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు బటయపడటం కూడా అధికార పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది.
ఈ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. దీన్ని ప్రజలు కూడా నమ్మారని స్పష్టమవుతోంది.
కాంగ్రెస్
6. సోషల్ మీడియా ప్రచారంలో దూసుకుపోయిన కాంగ్రెస్
సోషల్ మీడియా ప్రచారంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా దూసుకుపోయింది.
పార్టీ వ్యూహకర్త సునీల్ కానుగోలు నేతృత్వంలో కాంగ్రెస్ ఆఫ్‌లైన్‌లో చేసినట్లే సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారాన్ని చేపట్టింది.
వీడియోలు, మీమ్‌లు, GIF, పోస్టర్లలో వైవిధ్యాన్ని కనబరుస్తూ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారం ఆకట్టుకుంది.
సోషల్ మీడియాలో ప్రచారంతో యాంటీ-ఇంకంబెన్సీ ఫ్యాక్టర్‌ను సద్వినియోగం చేసుకోవడంలో కాంగ్రెస్ విజయవంతమైందని చెప్పాలి.
కాంగ్రెస్ పార్టీ, సునీల్ కనుగోలుకు సంబంధించిన టీమ్‌లు పోటీ పడి మరీ.. ప్రచారం చేసారు.
కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారం గ్రామీణ స్థాయిలో కూడా ఆకట్టుకున్నట్లు తాజాగా వెలువడిన ఫలితాలు చెబుతున్నాయి.