LOADING...
Hyderabad : ఇబ్రహీంపట్నంలో హై-టెన్షన్.. రాళ్లు రువ్వుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు

Hyderabad : ఇబ్రహీంపట్నంలో హై-టెన్షన్.. రాళ్లు రువ్వుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 09, 2023
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ శివారు నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు పరస్పరం ఎదురుపడటంతో రాజకీయంగా భగ్గుమన్నారు. ఈ క్రమంలోనే పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో రోడ్ల మీద భారీగా ట్రాఫిక్ నిలిచింది. ఘర్ణణలో పలువురికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులు సైతం ఎక్కడికక్కడ రోడ్ల మీదే బారులు తీరాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి. కాంగ్రెస్‌ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి గురువారం నామినేషన్‌ వేసేందుకు ర్యాలీగా బయల్దేరిన క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏకకాలంలో రెండు ప్రధాన పార్టీలు భారీ ర్యాలీగా తరలివెళ్లడంతో కార్యకర్తలు సంయమనం కోల్పోయి ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. పార్టీ జెండాలను విసురుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత