Visakhapatnam: విశాఖ కేంద్రంగా 'ఐటీ'.. ఐకానిక్ భవనం.. సిద్ధంగా 11 అంతస్తులు
ఈ వార్తాకథనం ఏంటి
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్టణంలో ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకెళ్లుతున్నాయి.
ఈ ప్రాంతంలో గూగుల్, ఇతర ప్రముఖ సంస్థలు కూడా తమ కేంద్రాలను నిర్వహించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ దావోస్ పర్యటనలో డేటా సెంటర్, గ్లోబల్ బిజినెస్ సెంటర్, ఏఐ అభివృద్ధి కేంద్రం,చిప్ తయారీ కేంద్రం,గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (జీసీసీ) వంటి సంస్థలతో చర్చలు జరిపారు.
ఈ క్రమంలో తగిన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది.
ఇందుకోసం విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ)ఆధ్వర్యంలో ఐకానిక్ భవన సముదాయాన్ని సిద్ధం చేస్తున్నాయి.
ఈ భవనాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వివరాలు
నౌక ఆకారంలో 11 అంతస్తుల్లో బహుళ అంతస్తుల కార్ల పార్కింగ్
నగరంలోని ప్రధాన ప్రాంతంలో నౌక ఆకారంలో 11 అంతస్తుల బహుళ అంతస్తుల కార్ల పార్కింగ్ సదుపాయం (ఎంఎల్‌సీపీ) నిర్మాణం జరుగుతుంది.
ఇందులో ఐదు అంతస్తుల్లో 1.90 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పార్కింగ్‌కు, మరో ఆరు అంతస్తుల్లో 1.65 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కార్యాలయ అవసరాలకు ఉపయోగించనున్నారు.
అత్యాధునిక సౌకర్యాలు, పార్కింగ్ వసతులతో రూపొందించిన ఈ భవనాన్ని గాలి, వెలుతురు సరిగ్గా వచ్చేలా, అందంగా కనిపించేలా అద్దాలతో నిర్మించారు.
వివరాలు
ప్రభుత్వంతో ప్రముఖ సంస్థలు ప్రతిపాదనలు
కార్యకలాపాలు ప్రారంభించిన తరువాత గ్లోబల్ కేపబులిటీ సెంటర్, డేటా ఇంక్యుబేషన్ సెంటర్లకు అనుకూలంగా సువిశాల ప్రాంగణాలు సిద్ధంగా ఉండటంతో ఈ భవనాన్ని జీసీసీలకు, బహుళ జాతి సంస్థలకు కేటాయించే ఆలోచన ఉంది.
దీనితో పాటు, త్వరలో ప్రారంభమయ్యే కార్యకలాపాలు యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేలా ప్రభుత్వంతో ప్రముఖ సంస్థలు ప్రతిపాదనలు చేస్తున్నారు.
నగర మధ్యభాగంలో ఉన్న ఈ భవనం, ప్రముఖ సంస్థలు ఇందులో చేరితే ఒక మంచి బ్రాండింగ్‌ను ఏర్పరుస్తుందని భావిస్తున్నారు.
దావోస్‌లో సీఎం పర్యటన ముగిసిన తర్వాత ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
వివరాలు
భవన ప్రత్యేకతలు:
విస్తీర్ణం: 1.72 ఎకరాలు
నిర్మాణ వ్యయం: రూ.87.50 కోట్లు
అంతస్తులు: 11 (6 కార్యాలయాల కోసం, 5 పార్కింగ్ కోసం)
పార్కింగ్: 430 కార్లు, 400 ద్విచక్ర వాహనాలు