LOADING...
Hyderabad: మేడ్చల్‌లో కలకలం.. గర్భిణి హత్య, శరీర భాగాలను వేరు చేసిన భర్త
మేడ్చల్‌లో కలకలం.. గర్భిణి హత్య, శరీర భాగాలను వేరు చేసిన భర్త

Hyderabad: మేడ్చల్‌లో కలకలం.. గర్భిణి హత్య, శరీర భాగాలను వేరు చేసిన భర్త

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2025
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పరిధిలోని బాలాజీహిల్స్‌లో కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. గర్భవతైన భార్యను భర్త కిరాతకంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వికారాబాద్‌ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి (25) కొన్నేళ్ల క్రితం మహేందర్‌రెడ్డితో ప్రేమవివాహం చేసుకుంది. వీరు ప్రస్తుతం బోడుప్పల్‌లో నివసిస్తున్నారు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ వివాదాల మధ్యే మహేందర్‌ తన భార్య స్వాతిని హతమార్చాడు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి, భాగాలను కవర్‌లో పెట్టి బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.

Details

  దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఈ క్రమంలో గదిలోనుంచి అనుమానాస్పద శబ్దాలు వినిపించడంతో పొరుగింటి వారు వెళ్లి చూడగా, కవర్‌లో మానవ శరీర భాగాలు కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా, భయంకర నిజం బయటపడింది. నిందితుడు మహేందర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను, భార్య స్వాతి శరీరంలోని చేతులు, కాళ్లు, తలను వేరు చేసి మూసీ నదిలో పడేశానని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పోలీసులు ఆ భాగాల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు మృతదేహంలోని ఛాతీ భాగాన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గల నిజమైన కారణాలను వెలికితీయడానికి పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.