
Gwalior: గ్వాలియర్‌లో ర్యాగింగ్ కలకలం.. మండే ఎండలో గంటల తరబడి మోకాళ్లపై కూర్చోపెట్టి ..
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఆయుర్వేదిక్ కాలేజీలో ర్యాగింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ఇక్కడ మొదటి సంవత్సరం విద్యార్థులను సీనియర్ విద్యార్థులు కొట్టి మోకాళ్ళ పైన కూర్చోబెట్టారు.
దీనిపై కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా వారు వినిపించుకోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
దీంతో అందరూ కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు.
తమ సీనియర్లు ప్రతి రోజూ ర్యాగింగ్ పేరుతో తమని కొడుతున్నారని తెలిపారు . కాలేజీ యాజమాన్యం కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
సోమవారం సీనియర్లు జూనియర్ విద్యార్థులను గంటల తరబడి ఇబ్బంది పెట్టారు. దీనిపై నిరసన తెలపడంతో దారుణంగా కొట్టారు. ఈ క్రమంలో ఒక విద్యార్థి బట్టలు, బూట్లు కూడా చిరిగిపోయాయి.
Details
జూనియర్ విద్యార్థుల నుంచి ఫిర్యాదు
దీనిపై కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పరువు పోతుందనే భయంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు తెలిపారు.
దాంతో పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. BMS విద్యార్థి పోలీస్ స్టేషన్‌లో గాయపడిన గుర్తులు, చిరిగిన దుస్తులను కూడా చూపించాడు, దీన్ని బట్టి అతన్ని ఎంత క్రూరంగా కొట్టారో అంచనా వేయవచ్చు.
తమ స్నేహితులను కూడా చంపేస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం ఈ విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.జూనియర్ విద్యార్థుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు.
ర్యాగింగ్‌పై నిషేధం ఉన్నప్పటికీ,ఆయుర్వేద కళాశాలలతోపాటు కొన్ని విద్యాసంస్థలు ర్యాగింగ్‌ను కొనసాగిస్తున్నా ఆ సంస్థలోని బాధ్యులు కళ్లు మూసుకుని కూర్చున్నారు.
మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.