LOADING...
Corn Cultivation: మొక్కజొన్నకు ఇథనాల్‌ జోష్‌.. ఆ పరిశ్రమల నుంచే 70% కొనుగోళ్లు
మొక్కజొన్నకు ఇథనాల్‌ జోష్‌.. ఆ పరిశ్రమల నుంచే 70% కొనుగోళ్లు

Corn Cultivation: మొక్కజొన్నకు ఇథనాల్‌ జోష్‌.. ఆ పరిశ్రమల నుంచే 70% కొనుగోళ్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2025
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో వరి, గోధుమల తర్వాత మొక్కజొన్న మూడో ఆహార పంట. దేశంలోని ఆహార వినియోగంలో దీనికి సుమారు 9% వాటా ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి, వానాకాలంలో మక్కల పంట 80% భాగంలో, యాసంగి సీజన్‌లో 20% భాగంలో పండుతుంది. ఈ పంటకు ప్రధానంగా ఇథనాల్ పరిశ్రమల అధిక డిమాండ్ కారణంగా మార్కెట్లో విపరీతమైన గరిష్ట కొనుగోలు ఉంటోంది. 2024-25 సీజన్‌లో మొత్తం ఉత్పత్తిలో సుమారు 70% మొక్కలు ఇథనాల్ కంపెనీలకు అందించబడ్డాయి. ఈ ఏడాది ఈ కొనుగోళ్లు మరింత పెరగనున్నాయని వ్యవసాయ, పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వివరాలు 

నాలుగేళ్ల నుంచి అనూహ్య మార్పు 

మొక్కజొన్నలు ఇప్పటికే రొట్టెల పిండి, బిస్కట్లు, పాప్‌కార్న్, ఔషధాలు, సౌందర్య పదార్థాలు, ఫిల్మ్, వస్త్ర, జిగురు, ప్యాకేజింగ్, ఆల్కహాల్, కాగితం వంటి పరిశ్రమలకు ముడిసరుకుగా ఉపయోగపడుతున్నాయి. పశువులు, కోళ్లు,ఇతర పశుగ్రాస ఉత్పత్తులకు కూడా మొక్కజొన్న ప్రధాన ముడిసరుకు. దేశంలో నాలుగేళ్ల నుంచి ఇథనాల్‌ పరిశ్రమలు రంగంలోకి దిగడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలపాలని నిర్ణయించింది. దాంతో దేశంలోని ఇథనాల్ పరిశ్రమ యాజమాన్యాలు మొక్కజొన్నలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం మొదలుపెట్టాయి. చెరకు, నూకలు వంటి ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ, ఈ పరిశ్రమల దృష్టి ప్రధానంగా మొక్కజొన్నలపై కేంద్రీకృతమై ఉంది.

వివరాలు 

నాలుగేళ్ల నుంచి అనూహ్య మార్పు 

2023-24లో చెరుకు, వరి కంటే మక్కలే ఇథనాల్ ఉత్పత్తిలో 42.74% వాటాను పొందాయి. 2024లో ఇథనాల్ కంపెనీలు సుమారు 7.5 మిలియన్ల టన్నుల మక్కలను కొనుగోలు చేశాయి. ఈ సంఖ్య 2025లో 13.3 మిలియన్ల టన్నులకు చేరవలసి ఉంది, ఇది మొత్తం ఉత్పత్తిలో సుమారు 70%కి సమానం. ఇథనాల్ కంపెనీల పోటీ కారణంగా, మక్కలకు మద్దతు ధర కంటే ఎక్కువ ధర మార్కెట్లో లభిస్తోంది.

వివరాలు 

తెలుగు రాష్ట్రాల్లో ఇలా... 

కేంద్ర గణాంకాల ప్రకారం 2025-26 వానాకాల సీజన్‌లో మొత్తం 91.89 లక్షల హెక్టార్లలో మక్కలు వేశారు. గత సంవత్సరం ఇదే సమయానికి 83.15 లక్షల హెక్టార్లే ఉండగా, ఈ సీజన్‌లో 10.5% పెరుగుదల జరిగింది. గత ఐదు సంవత్సరాల సగటుతో పోలిస్తే ఈ పెరుగుదల 16.3% ఎక్కువ. మక్కల ఉత్పత్తిలో కర్ణాటక అగ్రస్థానంలో ఉండగా,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 5వ,7వ స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది వానాకాలంలో తెలంగాణలో 6,27,540 ఎకరాల్లో మక్కలు పండించబడ్డాయి,ఇది రాష్ట్రం పెట్టిన సాగు లక్ష్యానికి 120% పైగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 3.58లక్షల ఎకరాల్లో మక్కలు పండించారు,ఇది గత సంవత్సరంతో పోలిస్తే 139% పెరుగుదల. రెండు రాష్ట్రాలలో మక్కల విత్తనోత్పత్తి కూడా పెరిగింది.సుమారు 60,000ఎకరాల్లో విత్తనోత్పత్తికి కంపెనీలు రైతులతో ఒప్పందం చేసుకున్నాయి.

వివరాలు 

దేశీయంగా ఉత్పత్తి పెరగాల్సిందే 

మొక్కజొన్నను పౌల్ట్రీ ఫార్మింగ్‌లో కోళ్లకు దాణాగా 50% వరకు ఉపయోగిస్తున్నారు. ఇథనాల్ కంపెనీల అధిక కొనుగోళ్లు కారణంగా, పౌల్ట్రీ, ఇతర పరిశ్రమలకు కొరత ఏర్పడింది. మార్కెట్లో 30% మాత్రమే మక్కలు అందుబాటులో ఉండటంతో, వాటి ధరలు గణనీయంగా పెరిగాయి. ఇది దేశీయ ఆహార, పౌల్ట్రీ పరిశ్రమలకు అధిక సాగు చేస్తేనే అవసరాన్ని చూపుతోంది.