Loading...
Coromandel Express: కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

Coromandel Express: కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2026
08:38 am

ఈ వార్తాకథనం ఏంటి

చెన్నై సెంట్రల్‌ నుంచి హావ్‌డా జంక్షన్‌కు వెళ్లే 12842 నంబరు కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. శనివారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు రోడ్డు సమీపంలో ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తి రైలు అకస్మాత్తుగా నిలిచిపోయింది. లోకోపైలట్‌ సమాచారం అందించడంతో బిట్రగుంట రైల్వే అధికారులు, సాంకేతిక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.

వివరాలు

ఎస్‌6 బోగీ చక్రాల్లో చిక్కుకున్న పవర్‌ కప్లర్

పరిశీలనలో ఎస్‌5 బోగీ కింద ఉండాల్సిన పవర్‌ కప్లర్‌ ఊడిపోయి ఎస్‌6 బోగీ చక్రాల్లో చిక్కుకున్నట్లు గుర్తించారు.

దీంతో రైలులోని మిగతా బోగీలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు నిర్ధారించారు.

వెంటనే సిబ్బంది ఎస్‌6 బోగీ చక్రాల వద్ద చిక్కుకున్న పవర్‌ కప్లర్‌ను తొలగించి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. అలాగే బ్రేక్‌ పవర్‌కు ఏర్పడిన అవరోధాలను కూడా తొలగించారు.

వివరాలు

దాదాపు రెండు గంటల పాటు నిలిచిన రైలు

ఈ సాంకేతిక సమస్య కారణంగా ఉదయం 9:55 గంటలకు అల్లూరు రోడ్డు స్టేషన్‌ యార్డులో నిలిచిపోయిన కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌.. మరమ్మతులు పూర్తయిన అనంతరం 11:53 గంటలకు తిరిగి బయలుదేరింది.

దీంతో ప్రయాణికులు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ADVERTISEMENT