Page Loader
దేశంలో కొత్తగా 756 మందికి కరోనా; యాక్టివ్ కేసులు 8115

దేశంలో కొత్తగా 756 మందికి కరోనా; యాక్టివ్ కేసులు 8115

వ్రాసిన వారు Stalin
May 21, 2023
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో గత 24గంటల్లో 756 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. తాజా కేసులతో కలిపి క్రియాశీల కేసుల సంఖ్య 8,115కు తగ్గినట్లు వెల్లడించింది. కరోనా కొత్తగా 8మంది మరణించినట్లు, దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,31,832కి పెరిగినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4.49 కోట్లు (4,49,86,461)కు చేరుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 98.80శాతంగా ఉంది. కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తుల సంఖ్య 4,44,46,514కు పెరిగింది. కేసు మరణాల రేటు 1.18శాతంగా నమోదైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన ట్వీట్