Page Loader
Covid Cases In India: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 1,000కి పైగా కేసులు
దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 1,000కి పైగా కేసులు

Covid Cases In India: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 1,000కి పైగా కేసులు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2025
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో కోవిడ్ మహమ్మారి మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా సుమారు 1,000 కొత్త కేసులు నమోదవడం ప్రజల్లో భయాందోళనను కలిగించింది. మే 30 నాటికి 1,828 యాక్టివ్ కేసులు ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య 2,710కి పెరిగింది. కరోనా కేసులు ప్రధానంగా ఢిల్లీ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేగంగా పెరుగుతున్నాయి. కేవలం ఒకే రోజులోనే 1,000కి పైగా కేసులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ అందించిన లెక్కల ప్రకారం, దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,710కి చేరింది.

Details

కేరళలో అధికంగా కేసులు

ఈ కేసులు కేరళలో అత్యధికంగా 1,147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత మహారాష్ట్రలో 424, ఢిల్లీ 494, గుజరాత్‌లో 223, కర్ణాటక, తమిళనాడులో చెరో 148, పశ్చిమ బెంగాల్‌లో 116 కేసులు నమోదయ్యాయి. ఇంకా, గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల ఏడుగురు మరణించినట్లు సమాచారం ఉంది. అయితే ఈ మరణాలపై ఇంకా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులతో ప్రజలను అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నాయి.