Page Loader
Exit Poll Prediction: ఎగ్జిట్ పోల్స్ సమయాన్ని సవరించిన ఎన్నికల సంఘం

Exit Poll Prediction: ఎగ్జిట్ పోల్స్ సమయాన్ని సవరించిన ఎన్నికల సంఘం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 30, 2023
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్,రాజస్థాన్,మధ్యప్రదేశ్,మిజోరాం,తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సోమవారం ముగియనున్న తరుణంలో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్ ఫలితాలపైనే ఉంది. ఓటింగ్‌కు ముందు ఎగ్జిట్‌ పోల్స్‌పై విధించిన నిషేధాన్ని తాజాగా ఎన్నికల సంఘం సవరించి సాయంత్రం 5.30గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకటించవచ్చని తెలిపింది. ముందుగా నవంబర్‌ 7వ తేదీ ఉదయం 7గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం 6.30 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఈసీ వెల్లడించింది. తాజాగా ఆ సమయంలో మార్పులు చేసింది. నవంబర్ ఏడు నుంచి విడతలవారీగా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌,మిజోరం,ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో పోలింగ్‌ పూర్తయింది. తెలంగాణలో కూడా నేటి సాయంత్రంతో పోలింగ్‌ పూర్తి కానుంది.దాంతో ఈ ఐదు రాష్ట్రాల నుంచి ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు(Exit Poll Predictions) రానున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎన్నికల సంఘం చేసిన ట్వీట్