
Pahalgam Terror Attack: పహల్గాం దాడి తర్వాత కౌంటర్ చర్యలు.. ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) అనంతరం జమ్ముకశ్మీర్ భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.
ఈ దారుణ ఘటనకు పాల్పడ్డ ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి.
లష్కరే తోయిబా ఉగ్ర సంస్థతో సంబంధాలున్న ఉగ్రవాదులు, అనుమానితుల కోసం ప్రత్యేకంగా గాలింపు కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదులపై దాడులు జరిపిన భద్రతా బలగాలు, ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లను గుర్తించి, వాటిని ధ్వంసం చేశాయి.
Details
ఆపరేషన్ కొనసాగుతోంది
ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల నివాసాలను తనిఖీ చేయడంతో పాటు, వారి వద్ద నుండి సమాచారం సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.
పహల్గాం దాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్రంగా స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో, భద్రతా విభాగాలు మరింత అప్రమత్తమై కదలికలు కొనసాగిస్తున్నాయి.
ఉగ్రవాద నెట్వర్క్‌ను ఛేదించే దిశగా ఈ ఆపరేషన్ కొనసాగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి.