LOADING...
MLC kavitha: ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్  
తీర్పు రిజర్వ్ చేసిన రౌస్ ఎవెన్యూ కోర్టు

MLC kavitha: ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్  

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2024
01:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ మద్యం కేసులో కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 9 వరకు జుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను పోలీసులు తిహార్ జైలుకు తరలించనున్నారు. 10 రోజుల ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఏప్రిల్ 9వ తేదీ వరకు కవిత జ్యూడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. ఏప్రిల్ 9 న ఉదయం 11 గంటలకు కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై కూడా కోర్టు విచారణ జరిపింది. ఈడీ అధికారులు, కవిత తరఫు న్యాయవాదులు పిటిషన్‌పై వాదనలు వినిపించారు.

Details 

ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా పడిన బెయిల్‌ పిటిషన్‌

ఈడీ అధికారులు, కవిత తరఫు న్యాయవాదులు పిటిషన్‌పై వాదనలు వినిపించారు. తన పిల్లలకు పరీక్షలు ఉన్నాయనీ.. మధ్యంతర బెయిల్‌ అయినా మంజూరు చేయాలని కవిత బెయిల్‌ పిటిషన్‌ ద్వారా పేర్కొన్నారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందనీ.. పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. కాగా, కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది.