Covid Cases : 3 వేలకు చేరువుగా కొవిడ్ కేసులు.. అలెర్ట్ ప్రకటించిన కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో కొవిడ్ రక్కసి మరోసారి విజృంభిస్తోంది. ఈ మేరకు క్రియాశీల కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే శుక్రవారం మూడు వేల మార్క్‌కు చేరువగా కేసులు అధికమవుతున్నాయి.
సబ్-వేరియంట్ JN-1 మొదటి కేసును గుర్తించిన తర్వాత కేసుల ఆకస్మిక పెరుగుదల మధ్య కేరళలో ఒకరు మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.
క్రియాశీల కేసులు గురువారం 2,669 ఉండగా, శుక్రవారం ఉదయం నాటికి 2,997కి ఎగబాకాయి. కేరళకు చెందిన ఒకరు వైరస్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 5,33,328కి చేరుకుంది.
ఇక మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. 10 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోనూ యాక్టివ్ కేసులు పెరిగాయి.
DETAILS
గురువారం ఒక్కరోజే 594 కేసులు నమోదు
ఇప్పటివరకు 4,44,70,887 మంది కోలుకున్నారు. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఇప్పటివరకు, 220.67 కోట్ల (220,67,79,081) డోస్‌ల కొవిడ్ వ్యాక్సిన్‌ను అందించారు. JN.1 మొదటిసారిగా గుర్తించబడిన కేరళలో, గత 24 గంటల్లో మరో 265 కేసులు నమోదైంది.
దేశవ్యాప్తంగా బుధవారం వరకు JN.1 వేరియంట్‌కు సంబంధించిన 21 కేసులు కనుగొనబడ్డాయి. గురువారం 594 తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.
బీహార్‌లోని పాట్నాలో ఇద్దరు వ్యక్తులకు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. పాట్నాలోని ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఐజీఐఎంఎస్)లో ఒకరిని పాజిటివ్‌గా గుర్తించారు. బిహ్తాలోని ఈఎస్‌ఐసీ హాస్పిటల్‌లో మరొకరికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.