COVID Cases in India: భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్కరోజులో 752 మందికి వైరస్
ఈ వార్తాకథనం ఏంటి
COVID Cases in India: దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా యాక్టివ్ కేసుల శనివారం నాటికి 3,000 వేల మార్కును దాటినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
భారత్‌లో ప్రస్తుతం 3,420 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. అలాగే JN.1 వేరియంట్ వేగంగా విస్తున్నట్లు కేంద్రం చెప్పింది.
దేశంలో గత 24 గంటల్లో 752 కరోనా కొత్త కేసులు నమోదు కాగా.. వైరస్‌తో నలుగురు మరణించినట్లు వివరించింది.
మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. గత 24గంటల్లో కేరళలో 266, కర్ణాటకలో 70, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 13, గుజరాత్‌లో 12 మంది కేసులు నమోదయ్యాయి.
కేరళలో రెండు మరణాలు, కర్ణాటక, రాజస్థాన్‌లలో ఒక్కొక్కరి మరణించారు.
కరోనా
ప్రజలు భయపడొద్దు: కేంద్రం
కోవిడ్-19 కేసులు పెరగడం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలు భయపడవద్దని కేంద్రం కోరింది.
అయితే అందరూ కరోనా నిబంధనలను పాటించాలని పేర్కొంది. ముందస్తు జాగ్రత్తగా ఫేస్ మాస్క్‌లు ధరించాలని కేంద్రం సూచించింది.
ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా దేశవ్యాప్తంగా ఆరోగ్య సౌకర్యాల సంసిద్ధతను సమీక్షించారు. కోవిడ్ వేరియంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను అలర్ట్ చేశారు.
కోవిడ్‌కు చెందిన ఒమిక్రాన్ సబ్-వేరియంట్ JN.1 వేగంగా విస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే భారత్‌లో JN.1 వేరియంట్ సోకిన వారిలో ఎవరికీ సీరియస్‌గా లేదని, అందరికీ తేలికపాటి లక్షణాలే ఉ న్నట్లు కేంద్రం చెబుతోంది. దేశంలో 17 రాష్ట్రాల్లో కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.