
Tamil Nadu: జ్వరానికి గోమూత్రం ఔషధం.. ఐఐటీ మద్రాస్ సంచాలకుడు వివరణ
ఈ వార్తాకథనం ఏంటి
గోమూత్రం తాగితే జ్వరం తగ్గిపోతుందని, అప్పుడప్పుడు తాగడం ఆరోగ్యానికి మంచిదని ఐఐటీ మద్రాస్ సంచాలకుడు కామకోటి తెలిపారు. జనవరి 15న కనుమ సందర్భంగా చెన్నై వెస్ట్ మాంబళంలోని గోశాలలో జరిగిన గోపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గోమూత్రం జ్వరానికి పరిష్కారమని, ఆరోగ్య పరంగా దాని ప్రభావం మంచిదని కామకోటి పేర్కొన్నారు. కనుమ సందర్భంగా గోపూజలో పాల్గొన్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
Details
15 నిమిషాల్లో తగ్గిపోయింది
మా నాన్నకు ఒకసారి జ్వరం వచ్చిందని, వైద్యుడి వద్దకు వెళ్లాలని అడిగినప్పుడు, ఓ సన్యాసి గోమూత్రం తాగితే జ్వరం తగ్గిపోతుందని సూచించారన్నారు. ఆయన చెప్పినట్లు గోమూత్రం తీసుకున్న 15 నిమిషాల్లో జ్వరం తగ్గిపోయిందని గుర్తుచేశారు. గోమూత్రం శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియాలను ఎదుర్కొనే శక్తి ఉన్న అత్యుత్తమ ఔషధమని కామకోటి వివరించారు.